బాలకృష్ణ లేజెండ్‌ విడుదల అయిన రోజున మొదటి షోకు వచ్చిన ప్రతిస్పందన చూసాక నందమూరి హీరోలలో 50 కోట్ల మార్కును అందుకునే చిత్రంగా బాలకృష్ణకు ‘లెజెండ్’ ఓకే సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అనుకున్నారు అంతా. దానికి థగ్గటుగా మీడియాలో ఈ సినిమా పై రివ్యూస్ బాగారవడంతో బాలయ్యకు ఎదురులేదు అని అనుకున్నారు.  అయితే ప్రస్తుతపరిస్తుతులలో 50 కోట్ల షేర్ అంత సులువు కాదు అని ‘లెజెండ్’ విషయంలో కూడ ఋజువు అయింది అని అంటున్నారు. ఈ సినిమా ఈ శుక్రువారంతో నాలుగోవ వారంలోకి ప్రవేశిస్తున్నా ఈ సినిమా కలెక్షన్స్ ప్రతి వారంవారం జరుగుతున్న కొద్ది నిలకడగా ఉందా కుండా బాగా డ్రాప్ అవడంతో 50 కోట్ల మార్క్ బాలయ్యకు కలగానే మిగిలి పోతుంది అని అంటున్నారు.  రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కి పోవడం ఒక కారణం అయితే లెజెండ్ తరువాత విడుదల అయిన అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడం మరొక కారణంగా చెప్పుకోవాలి. ‘రేసుగుర్రం’ వచ్చే వరకు స్టడీగా ఉన్న ‘లెజెండ్‌’ గుర్రం రాకతో ఒక్కసారిగా పాతబడిపోయింది. రేసుగుర్రం మీదకి ఆడియన్స్‌ దృష్టి ముఖ్యంగా యూత్ ద్రుష్టి షిఫ్ట్‌ అవడంతో లెజెండ్‌ కలెక్షన్స్‌ పడిపోయాయి అని అంటున్నారు  ప్రస్తుత పరిస్థుతులలో బాలయ్య ఫిఫ్టీ కొట్టడం అసాధ్యం అయిపోగా, నలభై కోట్ల క్లబ్‌లో చేరడం కూడా కష్ట సాధ్యమై అని అంటున్నారు ట్రేడ్ పండితులు. భారీ అంచనాలతో విడుదల అయిన లెజెండ్‌ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కూడా మూడవ వారం నుండి కలెక్షన్స్ విషయంలో చతికల పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: