క్యూట్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన చిరునామాను కోలీవుడ్ గా మర్చేసుకుoటోoది. ఈ కారణంతో ప్రస్తుతం ఈ మాయలేడి తమిళ సినిమాలన్నా, తమిళ హీరోలన్నా విపరీతమైన అశక్తిని చూపెడుతూ అక్కడి హీరోల పొగడ్తల భజన కార్యక్రమం కార్యక్రమం చేస్తోంది. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా సమంత ఓ తమిళహీరోతో ఏడు రోజులకు ఒప్పందం కుర్చుకుంది అనే వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ ఒప్పందం మరేదో విషయానికి సంబంధించింది కాదు.. ‘ఏడు రోజులు’ అనేది సినిమా పేరు. సూర్య తమ్ముడు హీరో కార్తీ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'ఎన్ని ఏళు నాట్కళ్'. అంటే తెలుగులో ఏడు రోజులు అని అర్ధం. సమంత ప్రస్తుతం తమిళంలో సూర్యతో అంజాన్ సినిమాతో పాటు విజయ్ తో మరో సినిమా కూడా చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ విలక్షణ విక్రం సినిమాకు కూడా డేట్స్ ఇవ్వబోతోంది..  గతంలో కార్తీ హీరోగా 'ఆవారా' చిత్రం రూపొందించిన లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆవారా సినిమా మాదిరే ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత తన హాట్ లుక్స్ తో కనిపించ బోతోంది. అయితే కార్తీతో సమంత ఒప్పందం మాత్రం ఈ సంవత్సరం ఆగస్టులో ఉంటుందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. మొత్తానికి తన ప్రియ నేస్తం సిద్దూకు ఇచ్చిన మాట ప్రకారం సమంత ఇక ఇంచుమించు టాలీవుడ్ కు దూరం అవుతున్నట్లే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: