టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ర్టీలో ప్రకాష్ రాజ్‌ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నిన్న మొన్నటి వరకు టాప్ హీరోలు నటించే ప్రతి సినిమాలోను ప్రకాష్ రాజ్ పాత్ర లేకుండా సినిమా ఉండేది కాదు. టాప్ హీరోలు కూడ తమ డేట్స్ ను ప్రకాష్ రాజ్ డేట్స్ కు అనుగుణంగా నిర్మాతలకు ఇచ్చే వారు. విలక్షణ నటుడిగా ఒక స్థాయికి ఎదిగిన ప్రకాష్ రాజ్ కెరియర్ పై నీలి మేఘాలు అలుము కోవడం ఒక వైపు ఆశ్చర్యకరంగా మరొక వైపు ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిస్థితికి ప్రకాష్ రాజ్ ప్రవర్తన కారణమని టాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. ఈమధ్య ఆయన నటించిన చాలా సినిమాల్లో డిసిప్లేన్‌ను పాటించడంలేదని నిర్మాతలకు అసలు విలువే ఇవ్వడంలేదని వారంటున్నారు. అందుకు నిదర్శనంగా మొన్న ‘ఆగడు’ సినిమా నుండి ప్రకాష్ రాజ్ ను తొలిగించిన సంఘటన ఒకటి అయితే గత వారం విడుదలైన 'రేసుగుర్రం' సినిమాను కూడ ఉదహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ మిడిల్‌లో కట్‌ అయిపోయి క్లయిమాక్స్‌లో కూడా ప్రకాష్ రాజ్ పాత్ర కనిపించక పోవడం షూటింగ్‌కి ప్రకాష్‌రాజ్‌ రాకపోవడమే కారణమంటున్నారు. ఇలాంటి తలనొప్పులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోలకు, దర్శక నిర్మాతలకు లెజెండ్ సినిమా ద్వారా విలన్ అవతారం ఎత్తిన జగపతి బాబు దేవుడిగా మారాడు అంటు సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం కుర్ర హీరోల నుండి పెద్ద హీరోల వరకు జగపతి వైపు చూస్తూ ఉండటంతో మరో రెండు హిట్లు జగపతికి విలన్ గా తగిలితే ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ మరిచిపోయే రోజులు వస్తాయి అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: