ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. హీరోలు పాటలు పాడడం అనే ట్రెండ్ చాలా రోజుల నుంచి వస్తున్నదే. అయితే ఆ మధ్య కోలీవుడ్ స్టార్ ధనుష్ 'కొలవెరి' అనే పాట పాడి మరింత క్రేజ్ పెంచాడు. ఆ తర్వాత అడపాదడపా తెలుగు, తమిళ్ హీరోలు వారి సినిమాల్లో.. లేక పక్క హీరోల సినిమాల్లో పాటలు పాడుతూ.. సినిమాకి హైప్ తెస్తున్నారు. తాము పాడిన సినిమా హిట్టైందని సెంటిమెంటో లేక... సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కోసమో గానీ మన స్టార్లు పాడేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. లాస్ట్ ఇయర్ 'అత్తారింటికి దారేదీ' తో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ ఆ సినిమాలో 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా' అంటూ పాట పాడి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు పవన్ పాట అదనపు ఆకర్షణ అయ్యింది. దీంతో ఈ ట్రెండ్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ లిస్ట్ లో ఇప్పుడు ప్రిన్స్ చేరిపోయాడు. తన సినిమాల్లో డైలాగులు కూడా చాలా పొదుపుగా చెప్పే మహేష్ బాబు.. ఈ మధ్య రెగ్యులర్ గా పాటలు పాడుతున్నాడు. 'బిజినెస్ మేన్' లో థీమ్ సాంగ్ పాడిన మహేష్... తాజగా 'ఆగడు'లోనూ పాట పాడుతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ 'తమన్' పట్టుబట్టి మహేష్ తో సాంగ్ ట్యూన్ చేస్తున్నాడు. దీంతో ఇప్పటి నుంచే 'ఆగడు' సినిమాకు ఇదో పబ్లిసిటీ అవుతోంది. మహేష్ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాను శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగడు మూవీలో ప్రిన్స్ పాడిన సాంగ్ ఏ రేంజ్ లో పేలుతుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. మహేష్ బాబు పాడిన పాటలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అవుతాయా? మూవీకు మాత్రమే హైప్ క్రియేట్ చేస్తాయా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: