హీరోయిన్ నుండి టాప్ హీరోయిన్ పొజిషన్ వరకూ చేరుకున్నారంటే, వారి వ్యక్తిగత జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే ఆ సమయంలో వారి కోరికలో ఎలా ఉంటాయో, వారికే తెలియదు కాబట్టి. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియభట్, పెళ్లి చేసుకోవటానికి కొని ఇబ్భందులు ఉన్నాయంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు వినిపిస్తుంది. గత రెండేళ్లల్లో బాలీవుడ్‌కి పరిచయమైన తారల్లో అలియా భట్ అందచందాలకు, అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ‘‘నేను స్టార్ అనిపించు కోవడానికి రాలేదు. మంచి నటి అనిపించుకోవాలనే ఆకాంక్షతో సినిమాల్లోకి వచ్చాను’’ అని రీసెంట్ గా ఓ సందర్భంలో అలియా అన్నారు. అందుకే, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారట. మహేష్‌భట్ మంచి దర్శకుడనే విషయం తెలిసిందే. తన తండ్రి దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని అలియా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సొట్ట బుగ్గల సుందరి పెళ్లికి తన తండ్రే అడ్డంకి అట. మేటర్ ఏంటంటే అలియాతో పాటు మహేష్‌భట్‌కి ఇంకో కూతురు కూడా ఉంది. తన పేరు షహీన్. తన ఇద్దరి కూతుళ్లనూ ప్రాణంతో సమానంగా భావిస్తారు మహేష్‌భట్. అది ఎంతలా ఉంటుందంటే కూతుళ్లకి పెళ్లి చేస్తే, అత్తారింటికి వెళ్లిపోతారేమోనని బెంగ అట. దీని గురించి అలియా భట్ చెబుతూ -‘‘పెళ్లి చేసుకుని, కూతురు అత్తారింటికి వెళుతుంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది. మా నాన్నకి నేను, అక్క అంటే విపరీతమైన ప్రేమ. అందుకే మాకు పెళ్లి చేయకూడదనుకుంటున్నారు. దీంతో అలియభట్ కు పెళ్లి మరో ఏడు సంవత్సరాల వరకూ లేనట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: