అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లడ్డుబాబు’ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం అల్లరోడిని తీవ్ర నిరుత్సాహంలో పడేసింది. ఈ నేపధ్యంలో రవిబాబుకు ఏమైందో తెలియదు కాని సినిమా అనేది అన్ని వర్గాలకు నచ్చాలనే ఆలోచనలో ప్రస్తుతం జనం ఉంటున్నారని అందరికీ నచ్చే సినిమా చేయాలంటే గతంలో వచ్చిన సినిమాలకే మార్పులు చేసి తీయాలి అప్పుడు అది కాపీ సినిమా అంటు కామెంట్లు వస్తాయి. అటు మీడియా పైనా ఇటు ప్రేక్షకులు పైనా రవిబాబు కామెంట్లు విసరడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  అల్లరి నరేష్ ను భారీకాయుడిగా చూపించి వినోదాత్మకమైన చిత్రం తీస్తారనుకున్నాం, కానీ ఇలా భావోద్వేగభరిత సినిమా ఎందుకు తీశారు అని కొందరు అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక అసహనానికి లోనవుతున్నాడట రవిబాబు. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి చానల్స్ లో ప్రసారమవుతున్న యాడ్స్ ను డిజైన్ చేసి తయారు చేసింది రవిబాబు అన్న విషయం వెలుగులోకి వస్తోంది.  ప్రస్తుతం ఎన్నికలలో కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వీస్తున్న తెలుగుదేశం పవనాలకు రవిబాబు రూపొందించిన యాడ్స్ బాగా జనంలోకి వెళ్ళిపోయాయి అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రవిబాబు లడ్డుబాబులో హిట్ కొట్టలేకపోయినా, యాడ్ మేకర్ గా బంపర్ హిట్ కొట్టాడు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: