తెలుగు తెర జక్కనగా ప్రేక్షకుల దృష్టిలో ఒక సుస్థిర స్థాన్నాన్ని ఏర్పరుచుకున్న రాజమౌళి దక్షిణాది సినిమాల సూపర్ స్టార్ రజనీకాంత్ అడిగిన వింత కోరికకకు షాక్ అయ్యాను అంటూ ట్విటర్లు పెడుతున్నాడు. దీనికి కారణం మొన్న జరిగిన ‘విక్రమసింహ’ ఆడియో లాంచ్ ఫంక్షన్ లో రజని రాజమౌళిని అడిగిన కోరిక అని అంటున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ మూవీ సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ చూడాలనుంది అని రాజమౌళిని రజని అడిగాడట. సూపర్‌స్టార్ అంతటి వాడు వచ్చి అలాంటి కోరక కోరితే ఎవరైనా కాదంటారా? అందుకే రజనీ అలా అడగటమే గొప్పగా భావించిన రాజమౌళి ఆయనకి థాంక్స్ చెప్పడమే కాకుండా అది తన జీవితంల మరిచిపోలేని సంఘటన అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు రాజమౌళి.  ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు కూడా. రజనీ వచ్చి తనని ఇలా అడగటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అని రాజమౌళి తన సన్నిహితుల వద్ద సంతోషం వ్యక్తం చేస్తున్నాడట. ఇప్పటికే హాలీవుడ్ దర్శకులు కూడా ఏరికోరి ఈ సినిమా షూటింగ్ ను వచ్చి చూస్తూ ఉంటే ఆలిస్టులో ఇప్పుడు కోత్తగా రజని వచ్చి చేరడం ‘బాహుబలి’ క్రేజ్ ను మరింత పెంచుతోంది. అన్ని కుదిరితే రజని కూడా జకన్న సినిమాలో నటించే రోజులో దగ్గర లోనే ఉన్నాయి అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: