వెబ్ మీడియాలో పవన్ కు అభిమానుల సంఖ్య కంటే విరోధుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోందా అని అనిపించేటట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎన్నికలు తరువాత పవన్ కళ్యాణ్‌ కు ఆర్థిక కష్టాలు తప్పవు అంటూ మరో కొత్త అంశాన్ని వెబ్ మీడియా తెరపైకి తీసుకు వస్తున్నారు. ఎన్నికలు ముగిసాక సినిమాలో నటిద్దాం అని అను కుంటున్న పవన్ కు డబ్బు సమస్యలు వస్తాయి అంటే ఎవ్వరు నమ్మరు. అయితే పవన్ ఇబ్బందులు అన్ని ఆయన ‘జనసేన’ పార్టీ తీసుకు వచ్చే ఆర్ధిక కష్టాలు అని అంటున్నారు సోషల్ మీడియా నెటిజెన్స్. ఎన్నికలు తరువాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారానికి కొంత సుధీర్ఘ విరామాన్ని ఇస్తాయి.  కానీ పవన్ జనసేనకు అలా కుదరదు. కొత్త ప్రభుత్వ విధానాల పై పవన్ ప్రశ్నిస్తూ జనంలోకి తన జనసేనను తీసుకు వెళ్ళక పోతే జనసేన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికోసం భారీ ప్రచారం చేపట్టాలి. ప్రస్తుత పరిస్థుతులలో ప్రచారం అంటే అంత తేలిక కాదు కాబట్టి పవన్ తన జనసేనను పోషించుకోలేని ఆర్ధిక కష్టాలలో పడిపోతాడు అని కొoదరి విశ్లేషకుల వాదన. ఈ పరిస్థుతులలో ప్రస్తుతం పవన్ జనసేనకు అవసరమయ్యే ఖర్చులన్నీ పివిపి యే భరిస్తున్నారని ఓపెన్ సీక్రెట్. ఈ నేపధ్యంలో ఎన్నికల పోటీలో ఆశాభంగo పొందిన పివిపి తన మనసు మార్చుకుంటే పవన్ కు రాజకీయాల మూలంగా ఆర్ధిక కష్టాలు రావడమే కాకుండా జనసేన మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందని మరో విష ప్రచారం పవన్ పై మొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: