టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఒళ్ళు జలదరించే సంఘటన జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటి దేవుడుగా కొలుచుకునే నిర్మాతలకు మరో సారి అన్యాయం జరిగింది. శనివారం రోజున బూచోడు అనే తెలుగు మూవీ డైరెక్టర్ కం ప్రొడ్యూజర్ జగధీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. విశాఖపట్నం, సింహపురిలో ఈ సంఘటన జరిగింది. ఈ న్యూస్ ను తెలుసుకున్న ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జగదీష్ ఓ ఎలక్ట్రికల్ పోల్ కి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఓ మెసేజ్ ను, తన బ్రదర్ కి పంపించాడు. ఈ ఉదంతానికి కారణాలు తెలుసుకున్న పోలీసులు, ఫైనాన్షియల్ ఇబ్భందులే ప్రధాన కారణంగా ఉన్నాయని చెబుతున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బూచోడు అనే మూవీ ద్వారా డైరెక్టర్ అలాగే నిర్మాతగానూ పరిచయం అవుతున్నాడు. బూచోడు మూవీను వారం రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. జగధీష్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒకరు ఇంటర్నీడియట్ సెకండ్ ఇయర్ కాగా, మరొకరు బిటెక్ చదువుతున్నారు. మొత్తంగా జగధీష్ చేసుకున్న ఈ ఘటనకి అసలు కారణం ఫైనాన్షియల్ ఇబ్బందులేనా, మరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువులు, దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని, మూవీకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బుందులు ఉన్నాయని తెలుసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: