తెలుగుదేశం పార్టీకి కంచుకోట హిందూపురం నుండి ఎన్నికల బరిలో దిగితే తనకు ఎదురులేదని ఉద్దేశ్యంతో ఏరికోరి పోటీ చేస్తున్న బాలకృష్ణకు హిందుపురం చుక్కలు చూపెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం హిందుపూర్ లోని తెలుగుదేశం నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు అని అంటున్నారు..  హిందూపురం మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారుగా విడిపోయి ప్రవర్తిస్తున్నతీరు బాలకృష్ణకు విపరీతమైన టెన్షన్ పెడుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య ప్రచారంలో అబ్దుల్ ఘని, అంబికా ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో బాలయ్య వారితో పర్సనల్‌గా చర్చలు జరుపుతున్నారు అని టాక్. తాను ఎన్నికల్లో గెలవడమే కాదు పార్టీని కూడా అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అందరిపై వుందంటూ వారిని సముదాయిస్తున్నారట. హిందూపురంలోనే కాకుండా రాష్ట్రమంత తాను పర్యటించి పార్టీ గెలుపునకు క‌ృషి చేయాల్సి వుందని కాబట్టి మీరంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బాలయ్య అందరికీ క్లాసులు తీసుకుంటున్నాడట. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా తాను ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉందని, పది రోజుల తర్వాత వస్తానని.. ఆ సమయానికి పార్టీ పరిస్థితి మెరుగయ్యేలా చూడాలని తన బావమరిది ప్రసాద్‌కు హిందూపురం బాధ్యతను అప్పగించారట బాలకృష్ణ. దీనితో పాటు డోర్ టు డోర్ ప్రచారం చేయడానికి మరో నందమూరి యంగ్ హీరో తారకరత్నను ప్రచార రంగంలోకి దింపడానికి ఈ టెన్షన్ ప్రధాన కారణం అని అంటున్నారు. బాలయ్య లాంటి టాప్ హీరోలను కూడ ఖంగారు పెడుతున్న పరిస్తుతులను చూస్తూ ఉంటే జరగబోతున్న ఎన్నికలు ఎంత టెన్షన్ తెప్పిస్తున్నాయో అర్ధం అవుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: