ఎంత మంది గ్లామరస్ హీరోయిన్స్ పోటీ ఇస్తున్నా సమంత క్రేజ్ కు ఎదురు లేదు అని చెప్పే మరొక విషయం ఈ మధ్యనే జరిగింది. ప్రతిరోజు వెబ్ మీడియాలో సందడి చేసే సమంత ఫేస్ బుక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అక్షరాల 5 మిలియన్ మార్క్ 50 లక్షల అభిమానుల సంఖ్యను దాటింది. అంతేకాదు ఆమె ట్విటర్ ను అభిమానించే ఫాలోయర్స్ సంఖ్య 5 లక్షలు దాటిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దక్షిణాది సినిమా రంగంలో ఏ హీరోయిన్ కు ఇప్పటి వరకు అందుకోలేని వెబ్ మీడియా రికార్డుల పరంపరను కొనసాగిస్తూ సమంత తన తోటి హీరోయిన్స్ కే కాదు తనను విమర్శించే వారికి కూడ సవాల్ విసురుతోంది. అందుకే సమంత డేట్స్ ఇస్తే చాలు కోట్లు కాళ్ళ ముందు పరుస్తున్నారు నిర్మాతలు. టాలీవుడ్, కోలీవుడ్ లను సరిసమానంగా ఏలుతున్న సమంత క్రేజ్ మరికొంత కాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ సినిమాలో సమంత మరింత క్యూట్ గా కనిపించిందనీ, ఈ సినిమా రషస్ చూసిన వారు అంటున్నారు. ప్రస్తుతం సమంత కోలీవుడ్ లో పెద్ద హీరోలతో టాలీవుడ్ లో యంగ్ హీరోలతో నటిస్తూ ఇద్దరినీ బేలెన్స్ చేస్తూ తన తెలివితేటలు ప్రదర్శిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: