జనసేన పార్టీ ప్రకటించాక అధికారికంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నాడని సమాచారం. పవన్ టిడిపి, బిజెపిలకు ప్రచారం చేయనున్న నేపథ్యంలో వారు ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాక పవన్ కు తెలుగుదేశం పార్టీ నుండి వస్తున్న అసంతృప్తులకు అడ్డుకట్ట వేయడానికి చంద్రబాబు ఈ భేటీని చాల వ్యూహాత్మకంగా మలుచు కుంటాడని టాక్. అదేవిధంగా ఈరోజు ఉదయం ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికలో అగస్త్య రిసర్చ్ ఎనాల్సిస్ ఏజన్సీ జరిపిన లేటెస్ట్ సర్వేలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దాదాపు 110 సీట్లు వస్తాయి అన్న ప్రీ పోల్ సర్వే విషయంపై కూడ వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుందని సమాచారం. పవన్ తో భేటీ అనంతరం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా బాలయ్య ఈరోజు నుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నరసన్నపేట నియోజకవర్గం సారవకోట చేరుకుంటారు. పదకొండున్నరకు రోడ్ షోలో పాల్గొని అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు అని తెలుస్తోంది.. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడ ఈరోజు చంద్రబాబు భేటీలో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు అనునయంతో పవన్ అలకలు తీరే అవకాసాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: