మెగా హీరో రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చాడు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే పాలసీలో ఒకే కుటుంబం నుండి రెండు రాజకీయ పార్టీలు స్థాపించిన హీరోలు మెగా హీరోలు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ గాను, ఫిల్మ్ కెరీర్ పరంగానూ మెగా ఫ్యామిలి పూర్తిగా దూరంలో పెట్టింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేంగా మీకు అందిస్తుంది. మెగా హీరోలంటే ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువ. చిరంజీవి తెచ్చిన ఈ ఇమేజ్ ఇప్పుడు తన తనయుడు రామ్ చరణ్ కూడా ఉపయోగించుకుంటున్నాడు. అలాగే 'మెగాస్టార్' ఇమేజ్ ను కూడా చరణ్ వాడుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా చరణ్ కు 'మెగా' అనే బిరుదుని ఇచ్చారు. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ ను కూడా కలుపుకొని 'మెగా పవర్ స్టార్' గా టాలీవుడ్ ను ఏలుతున్నాడు చరణ్. అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్లు. కానీ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీపెట్టడంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ప్రారంభమైయ్యాయి. చాలా వరకూ అందరూ చిరంజీవి వైపే ఉన్నామని పబ్లిగ్గానే చెప్పేశారు. దీనిలో భాగంగానే చరణ్ కూడా చిరంజీవి వైపే ఉంటున్నాడు. అందుకే అతని ద్వారా వచ్చిన తన బిరుదులోని పవర్ తీసేయాలని డిసైడ్ అయ్యాడని టాలీవుడ్ టాక్. ఈ విషయం తన అభిమానులందరికీ ఇప్పటికే చెప్పేశాడట. ఇక నుంచి తనను మెగా స్టార్ గా మాత్రమే సంబోధించాలని, మాటల్లోనే కాదు రాతల్లోనూ అలాగే ఉండాలని చెప్పాడట. అలాగే ఇక నుంచి తన సినిమాల్లోని టైటిల్ కార్డ్స్ లో కూడా ఇలా మెగా స్టార్ రామ్ చరణ్ అని మాత్రమే వేయాలని దర్శక నిర్మాతలకూ సూచించాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: