2014 ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఏ ప్రభుత్యం ఎర్పడుతుందో తెలియకుండానే ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తాను అని చెప్పే పవన్ 2017లో కచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం వుందని పవన్ కల్యాణ్ తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి ఏర్పడబోయే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తికాలం స్థిరంగా వుండకపోవచ్చని అవి మధ్యలోనే కుప్పకూలిపోయి తాజా ఎన్నికలకు దారి తీయవచ్చని పవన్ అంచనా అట. అందుకే పవన్ తన జనసేన పార్టీని పటిష్టపరిచి వాటి పునాదుల నుంచి సవ్యంగా నిర్మాణం జరగాలని నిన్న తనను కలిసిన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.  దీనికోసం పవన్ హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో ఇప్పటికే ఓ కార్యాలయాన్ని ప్రారంభిన విషయం తెలిసిందే. దీనికోసం పవన్ ఎన్నికల తరువాత షూటింగ్ లేని రోజులలో ప్రతిరోజు ఉదయం 9గంటల సమయానికి తన కార్యాలయానికి చేరుకుంటారని అవసరాన్ని బట్టి మధ్యాహ్నం 3.30 గంటలవరకు పార్టీ ఆఫీస్ లో ఉండాలని పవన్ ప్లాన్ చేసు కుంటున్నాడట. ఇది ఇలా ఉండగా నటుడు రాజారవీంద్ర ను పవన్ తన ఆఫీస్ వ్యవహారాలు చూసే ఇన్ ఛార్జ్ గా నియమిచినట్లు కుడా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తోంటే ఒక వైపు భారతీయ జనత పార్టీ కి మద్దతు ఇస్తున్నా ఆ పార్టీ విజయ అవకాశాల పై పవన్ కు స్వయం గా పెద్ద నమ్మకం లేదు అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: