పవన్ రాజకీయ ప్రవేశంతో మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలి పోయారు. ఏ ముహూర్తాన పవన్ అభిమానులు పవనిజం అని ఓ పేరు పెట్టుకొని వెబ్ మీడియాలో హడావిడి చేసారో తెలియదు కాని అక్కడ నుండి ప్రతి టాప్ హీరో  అదే పంధాను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడ చేరిపోయి చరణిజం పేరుతో ఓ గ్రూపును కడుతున్నాడట. ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ గ్రూపుతో అవసరం ఏమొచ్చింది అంటే.. రామ్ చరణ్ కూడా సీమాంధ్ర నుండి తన చరణిజమ్ గ్రూప్ ను చిరంజీవి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ కు అనుసంధానం చేయాలని రామ్ చరణ్ ఆలోచనట. సీమాంధ్రలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రామ్ చరణ్ కూడా తన వంతు ప్రచారానికి అనుగుణంగా ఈ చరణిజంను కాంగ్రెస్ కోసం ఉపయోగించాలని చెర్రీ ఆలోచన అని అంటున్నారు.  అయితే ఇప్పటికే ఊపిరి ఆగిపోయిన కాంగ్రెస్ కు చరణిజం ఎంతవరకు ఊపు తెస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి కొంతమంది చిరంజీవి వ్యతిరేకులైతే చరణిజమా? అదెక్కడుంది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో రామ్ చరణ్ లేదా బన్నీలను రాజకీయాలలోకి లాగడం ముమ్మాటికీ మంచింది కాదు అంటు కొదరు కామెంట్లు కూడ చేస్తున్నారు.  ఈ పరిస్థుతులలో సీమాంధ్రలో ప్రారంభం కాబోతున్న చరణిజమ్ ఎంత వరకు సంచలనాలు చేస్తుందో చూడాలి. ఇక రానున్న కాలంలో వెబ్ మీడియాలో పవనిజమ్ తో పోటీ పడుతూ చరణిజమ్ ప్రచారాలను కూడ చూస్తాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: