తెలంగాణలో బీజేపి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొద్ది గంటలలో పవన్ మోడీ తో కలిసి ఈరోజు హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో జరగనున్న బీజేపి ప్రచార సభల్లో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతోపాటు తాను కూడా పాల్గొననున్నట్లు పవన్ ప్రకటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో పవన్ కూడా మోదీతోపాటే వుంటారని అటు బీజేపి వర్గాలు సైతం చెబుతున్నాయి.  మోడీ కి  పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన అనంతరం పవన్ ప్రత్యక్షంగా తెలుగునాట పాల్గొంటున్న ఎన్నికల ప్రచారం ఇదే కావడంతో ఈ రోజు పవన్ చేయబోయే రాజకీయ ఉపన్యాసాల గురించి పవన్ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచి వక్తగా పేరున్న మోడీ కూడ పవన్ రాజకీయ ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వినడం ఇదే మొదటి సారి.  ఇది ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా మోడీతో పలు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి వుంది. అయితే బీజేపీ, చంద్రబాబుకి ‘రెడ్‌ సిగ్నల్‌’ వేసిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలవిన్పిస్తున్నాయి.‘చంద్రబాబుని వద్దని, పవన్‌కి ఆహ్వానం పలకడమేంటి.?’ అని కొందరు ఆశ్చర్యపోతు ఉంటే దీనికి కారణం ఈమధ్య తెలుగుదేశం బిజెపి ల మధ్య రచ్చకెక్కిన సీట్ల సద్దుబాటు విషయాలే అని అంటున్నారు.  అందువల్ల మోడీ చంద్రబాబును కేవలం హైదరాబాద్ సభకు మాత్రమే పరిమితం చేసి పవన్ ను మాత్రం తెలంగాణలోని ప్రతి సభలోనూ హైలెట్ చేయాలనీ మోడీ నిర్ణయించు కున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ ప్రసంగాన్ని అప్పుడే ప్రిపేర్‌ చేసుకున్నాడని టాక్. తెలంగాణలో జనసేన పార్టీ అధినేతగా ఒక బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడటం ఇదే ప్రధమం.  

మరింత సమాచారం తెలుసుకోండి: