ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, పాతికేళ్ల హీరో, పద్దెనిమిదేళ్ల హీరోయిన్.... ఈ ఫార్ములాని తుంగలో తొక్కిన క్రియేటివ్ వండర్ ఆర్. బాల్కీ... ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే... మూడోసారి అమితాబ్ తో కొలాబరేట్ అయ్యాడు. రీసెంట్ గా బాల్కీ, బిగ్ బీల సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే, అది స్టిల్ అన్ నేమ్డ్ ప్రాజెక్ట్ గానే నడుస్తోంది! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాల్కీ ఇప్పటికే సీనియర్ బచ్చన్ తో రెండు సినిమాలు చేశాడు. మొదటిసారి బిగ్ బి తో ఆయన చేసిన సినిమా చీని కమ్. ఈ సినిమా టైటిల్ లో చెక్కర తక్కువ అంటూ జనం ముందుకొచ్చినా... ఫిల్మ్ మేకర్స్ కలెక్షన్లు మాత్రం ఎక్కువే వసూలు చేసుకున్నారు. ఇక రెండో సారి బచ్చన్ సాబ్ ని ఆయన కొడుక్కే కొడుకుని చేసి చరిత్ర సృష్టించాడు బాల్కీ. పా సినిమాలో అమితాబ్ చేత పరమాద్భుతం చేయించాడు! చీని కమ్ , పా సినిమాల సక్సెస్ తరువాత బాల్కీ, బిగ్ బీ కలిసి చేస్తోన్న సినిమా ప్రస్తుతం సెట్స్ పైన వుంది. అయితే, ఈ ఆన్ గోయింగ్ సినిమాకి కమల్ అండ్ రజినీకి కూడా లింక్ వుంది! అంటే... అమితా బచ్చన్ సాబ్ తో పాటూ దక్షిణాది సూపర్ స్టార్స్ నటిస్తున్నారనుకోకండి! హీరోగా ధనుష్ రూపంలో రజినీ అల్లుడు యాక్ట్ చేస్తుంటే... హీరోయిన్ గా కమల్ కూతురు అక్షర ఇంట్రడ్యూస్ కానుంది! సో.... అలా అమితాబ్, కమల్, రజినీకాంత్... ముగ్గురు సూపర్ స్టార్ లకి కనెక్టెడ్ గా మారింది ఆర్ బాల్కీ అప్ కమింగ్ మూవీ! లెట్స్ వెయిట్ ఫర్ ది ఇళయరాజాస్ మ్యూజికల్!

మరింత సమాచారం తెలుసుకోండి: