తొడ కొట్టి సినిమా డైలాగ్స్ చెప్పడమే కాదు పొలిటికల్ డైలాగ్స్ కూడ అదిరిపోయేలా చెప్పగలను అని నిరూపించడానికి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేస్తున్న బాలయ్య అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన ఎన్నికల ప్రచారంలో బాలయ్య చంద్రబాబుదే అధికారం అనబోయి, జగన్‌దే అధికారమని అందర్నీ షాక్ కు గురిచేసాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకొని సర్దుకునే ప్రయత్నం చేశాడు నందమూరి సింహం.  దీనితో రాబోతున్న ఫలితాలను ముందుగానే ఊహించి బాలకృష్ణ ఈ మాటలు అన్నాడు అంటు జగన్ అభిమానులు సంబర పడుతున్నారు. నిన్న ఎన్నికల ప్రచారంలోభాగంగా మంగళవారం ఉదయం బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లాల్లోని నరసన్నపేటతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంలో బాలయ్య మాటలలో ఈ పొరపాటు దొర్లింది.  దీనికితోడు పేలవమైన ప్రసంగాలు, స్థానిక నాయకుల పేర్లు తెలియక బాలకృష్ణ చాలాసార్లు తడబడ్డాడు. కొన్ని ప్రాంతాల్లో బాలయ్య రోడ్ షోలకు అనుకున్నంత స్పందన రాలేదని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియా బాలకృష్ణ కనిపించినప్పుడల్లా బాలయ్యను జూనియర్ గురించి ప్రశ్నలు వేయడం ఆయనకు విపరీతమైన అసహనాన్నికి గురి చేస్తోంది.  ఈ సందర్భంలో పార్టీ ప్రచారం తన ఇంటి పెళ్ళి కాదనీ ఎవరైనా పార్టీ కోసం ప్రచారానికి రావచ్చనీ చెప్పిన మాటనే చెప్పి తప్పించుకుంటున్నాడు బాలయ్య. కాని జూనియర్ ప్రచారానికి రాని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అనే మాటలు తెలుగుదేశం కేడర్ నుండి వినిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: