టాలీవుడ్ హోమ్లీ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ హీరోగా చేసిన పలు మూవీలు టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ గా సాధించాయి. అయితే ప్రస్తుత రోజుల్లో శ్రీకాంత్ చేస్తున్న మూవీలకు అంతగా ఆధరణ లేకపోయినప్పటికీ, మంచి కథ దొరికితే మాత్రం శ్రీకాంత్ చేస్తున్న మూవీలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ వారసులు అయిన కొడుకు రోషన్, కూతురు మేథలు టాలీవుడ్ స్క్రీన్ కు పరిచయం అవుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గుణశేఖర్ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రుద్రమదేవి. ఈ మూవీ పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. టెక్నాలజితో తెరకెక్కుతున్న మూవీ కావటంతో సాంకేతికపరంగా ఈ మూవీకు ఉన్న విలువను పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు గమనిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరో శ్రీకాంత్ కొడుకు, కూతురులు నటిస్తున్నారు. రుద్రమదేవి మూవీలో వీరిద్దరికి కీలకపాత్రలను గుణశేఖర్ ఇచ్చాడు. త్వరలోనే వీరిద్దరిపై షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ అంటుంది. హీరో శ్రీకాంత్ ఇంతకాలం ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వీరి కొడుకు,కూతురు కూడ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించటానికి రెడీగా ఉన్నారు. వీరిద్దరు ఏ విధంగా సీల్వర్ స్క్రీన్ పై నటిస్తారో అని అందరూ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: