భారతీయ చలన చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు ఉన్న నిభందనలు మరే ఫిల్మ్ ఇండస్ట్రీకు ఉండేవేమో. ఎందుకంటే తెలుగు వారి సంప్రదాయం, వారి ఆచార వ్యవహార శైలి ఆ విధమైనది కాబట్టి. ఇదిలా ఉంటే రీసెంట్ గా మంచు లక్షీ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ చందమామ కథలు కాంట్రవర్సీ పాలయ్యింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని... ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. చందమామ కథలు మూవీ టైటిల్ వినటానికి ఎంత వినసొంపుగా ఉందో, మూవీకు చూస్తే కూడ ఓ సరికొత్త ఫీలింగ్ ను కలిగిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్న పబ్లిసిటి టాక్. అయితే ఈమూవీలో మంచు లక్ష్మీ ఓ ప్రముఖ పాత్రను చేసింది. కథానుసారం ఈ మూవీలో మంచు లక్ష్మీ నెగిటివ్ రోల్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మూవీలో కొద్దిపాటి సీన్స్ లో తను సిగరెట్ తాగటం లాంటివి చేస్తుంది. దానికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ పోస్టర్స్ పై పెట్టి చిత్రయూనిట్ పబ్లిసిటి స్టార్ట్ చేసింది. దీంతో ఆ పోస్టర్ ను చూసిన మహిళా సంఘాలు, ఇతర సామాజిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మంచు లక్ష్మీ సిగరెట్ తాగుతున్న పోస్టర్స్ ను వెంటనే తొలగించాలంటూ కొన్ని మహిళా సంఘాలు ఇప్పటికే తెలుగు చలనచిత్ర మండలికి పిర్యాదు చేశాయి. అయినా మాట వినకుంటే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటామని తెలుపుతున్నాయి. ఈ గొడవలతో చందమామ కథలు మూవీకు కావల్సినంత పబ్లిసిటి వస్తుంది. మంచు లక్ష్మీ కథలో భాగంగానే ఈ విధమైన సీన్స్ లో నటించింది. కథ పరంగానే సీన్స్ ను షూట్ చేశామని చిత్రయూనిట్ చెబుతున్నా, కావాలనే వేరే వ్యక్తులు ఈ విధమైన గొడవ చేస్తున్నారని చిత్రయూనిట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: