తెలుగు రాజకీయాలకి తెలుగు నటీనటులకి చాలా దగ్గరి అనుబంధం. ఇక నటరత్న ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం స్థాపన చేసి పాలిటిక్స్ కి కొత్త గ్లామర్ తెచ్చారు. అలాంటి పార్టీకి రూపంలోనూ, తేజంలోనూ.... తాతను పదే పదే గుర్తుకు తెచ్చే యంగ్ టైగర్ ఎన్టీఆర్.... పరాయి వాడు ఎలా అవుతాడు చెప్పండి!? అందుకే, ఆయన గత ఎన్నికల్లో ఎంతో శ్రమకోర్చి ప్రచారం చేశాడు. ఊరూ వాడా తిరుగుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ను తలపించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 2009లో యంగ్ టైగర్ చేసిన ప్రచారం ఎంత వరకూ ఉపయోగపడిందనేది ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే, టీడీపి మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత అనేక అనూహ్య పరిణామాలు జరిగి.... ఈసారి తెలంగాణ, ఆంధ్ర అంటూ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు జాతి. కాకపోతే, ఎన్టీఆర్ మాత్రం ఈ రాజకీయ గొడవలకన్నిటికీ దూరంగానే వుంటున్నాడు. పోయిన సారిలా జనం మధ్యకి కాదు కదా కనీసం టీవీల్లో కూడా రాజకీయ ప్రకటనలు చేయటం లేదు. సీరియెస్ గా రభస సినిమా షూటింగ్ పూర్తి చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ టీడీపి ప్రచారానికి దూరంగా వుండటం వెనుక పొలిటికల్ రీజన్స్ అనేకం వున్నాయి. రాజకీయ విశ్లేషకులైతే హరికృష్ణ, చంద్రబాబు మధ్య రిలేషన్ బాగా లేకపోవటమే ఈ పరిణామానికి కారణం అంటున్నారు. అదంతా ఎలా వున్నా గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ కొట్టని ఎన్టీఆర్ ఈ ఎలక్షన్స్ సీజన్లో ఎర్రటి ఎండలో కష్టపడకుండా సినిమాపై కాన్సట్రేట్ చేయటం... చాలా మంచిది! ఆఫ్ట్రాల్.... తమ హీరో ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే .... ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది!? పైగా మంచి సినిమాని టీడీపీనే కాదు అన్ని పార్టీల అభిమానులు ఏ ఇబ్బందీ లేకుండా ఎంజాయ్ చేయోచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: