టాలీవుడ్ గ్లామర్ రేసులో అందరికంటే ముందుంది శృతీ హసన్! అందుకే, ఆమె రేసు గుర్రం సినిమాని మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు యూత్! అయితే, తెలుగు రేసే కాదు తమిళంలోనూ శృతీ ఓ రేంజ్లో డిమాండ్ పెంచుకుంటోంది. ఇక హిందీలో కూడా మంచి గుర్తింపే వుంది. కమర్షియల్ సక్సెస్ తో పని లేకుండా గ్లామర్ క్వీన్ గా రిజస్టర్ అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ... ఇలా మూడేసి భాషల్లో ఆఫర్లు బాదేస్తున్న శృతీ హసన్ కి తెల్ల వెంట్రుకలు రానున్నయాట! కోలీవుడ్ లో వినిపిస్తున్న ఫన్నీ స్టోరిను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మ్యాటర్ కి సంబంధించీ... ఫుల్ డిటైల్స్ ఏంటంటే... శృతీ హిందీలో యారా అనే ఓ సిన్మా సైన్ చేసింది. అయితే, ఫ్లాష్ బ్యాక్ తో కూడుకుని నడిచే యారాలో రెండు జన్మల కథ కనిపిస్తుంది. దాంట్లో భాగంగా హీరో పాత్రకి పూర్వజన్మ పాత్రలో వేరే నటుడ్ని ఎంపిక చేశారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అయితే, యంగ్ హీరోతో రొమాన్స్ చేసిన శృతీని ఓల్డ్ హీరో పక్కన ఓల్డ్ లేడీగా చూపించాలని వాళ్లు డిసైడ్ అయ్యారట! ఇన్ ఫ్యాక్ట్ వాళ్లకు ఆ ఐడియా ఇచ్చి ముసలి పాత్ర చేయటానికి ఉత్సాహంగా శృతీనే ముందుకొచ్చిందట! యారా మూవీ డైరెక్టర్.... వేరే సీనియర్ హీరోయిన్ ని క్యాస్ట్ చేస్తానన్నా వద్దని.... శృతీ ఎంచుకున్న ఈ ఓల్డ్ లేడీ గెటప్ ఆమెకి ఎంత వరకూ మేలు చేస్తుందో ముందు ముందు చూడాలి. బట్... క్రిటిక్స్ మాత్రం శృతీకొచ్చిన ఈ తెల్ల జుట్టుతో నటించాలనే ఆలోచన... ఖచ్చితంగా తండ్రి కమల్ జీన్స్ వల్లేనంటున్నారు! వారసత్వం ఎక్కడిపోతుంది చెప్పండి!?

మరింత సమాచారం తెలుసుకోండి: