సామాన్యంగా పెళ్ళికి వెళ్ళేడప్పుడు బహుమతులు తీసుకు వెళ్ళడం సహజం. సెలిబ్రిటీల పెళ్ళి అంటే ఫ్లవర్ బంచ్ లతో మరియు బహుమతులతో వేదిక నిండిపోతుంది. అయితే తన వివాహానికి వచ్చే అతిధులు బహుమతులు, ఫ్లవర్ బంచ్ లు తేవద్దనీ చెపుతూ డబ్బు మాత్రం తీసుకురండి అని మొహమాటం లేకుండా ఆహ్వానించింది సమంత వాయిస్ చిన్మయి. ఇందుకు కారణం తన అభిమానులు తన పెళ్ళికి గిఫ్టుల కోసం వెచ్చించే డబ్బులను ‘17000ఎఫ్‌టి ఫౌండేషన్' కోసం విరాళంగా ఇవ్వాలని కోరుతోంది చిన్మయి.. లడఖ్ ప్రాంతానికి చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ ఆ ప్రాంతంలోని పేద పిల్లల విద్యకోసం సహాయ పడుతోంది. ఈ రోజుల్లో ఓ ఫ్లవర్ బొకే కొనాలంటే రూ. 500 ఖర్చవుతున్నాయి కాబట్టి వాటి కోసం వెచ్చించే డబ్బులను సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే బాగుటుందని చిన్మయి ఆలోచన.  అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకుంది చిన్మయి. ఈమె రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి ఫేం ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో ‘అందాల రాక్షసి’ చిత్రం తరువాత అనేక సినిమాలలో నటిస్తున్నాడు వీరిద్దరి పెళ్ళి వచ్చే నెల చెన్నై లో జరుగుతోంది. మరి చిన్మయి మాటలు పాటించి ఎంత మంది ఆమె సలహా పాటిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: