టాప్ హీరోయిన్స్ ఏమ్తమంది ఉన్నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సామంత చేసే హడావిడి మరి ఏ హీరోయిన్ చేయదు. సమంత పుట్టినరోజు ఈనెల 28వ తారీఖు అయినా అప్పుడే వెబ్ మీడియాలో ఆమె పుట్టినరోజు హడావిడి మొదలైంది. ఒక వారం రోజులు ముందుగానే ఆమె అభిమానులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా ఆమెకు రకరకాల బహుమతులు కూడ పంపుతున్నారట. అటువంటి అభిమానులలో స్రవంతి అనే వీరాభిమాని సమoతకు పంపిన బహుమతిని చూసి తాను కన్నీరు పెట్టుకున్నానని సమంత తన ట్విటర్ లో తెలిపింది. ఇంతకీ సమంతను కన్నీరు పెట్టించిన ఆ బహుమతి ఒక పుస్తకం. 27 పేజీలతో స్రవంతి సమంతను ఎందుకు అభిమానిస్తోందో తెలియ చేసే నాలుగు కారణాలను వివరంగా రాసిన ఈ పుస్తకం చదవగానే మన క్యూట్ హీరోయిన్ సమంతకు ఆనందంతో కంటి నుండి కన్నీరు ఆగలేదట. ఈవిషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్న సమంత అటువంటి అభిమానులను పాడటం తాను ఎదో జన్మలో చేసుకున్న అదృష్టం అని అంటోంది.  రోజురోజుకు టాప్ హీరోల నుంచి పెరిగి పోతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పుట్టిన తరువాత తన పారితోషికాన్ని కోటిన్నర మార్క్ దాటించే ఆలోచనలో ఉందట సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి: