అనామిక వచ్చేస్తోంది. అయితే, పేరుకే ఈ సినిమా అనామిక గాని...అనామకమైన సినిమా ఎంత మాత్రం కాదు. బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా నయనతార వుంది. స్ట్రాంగెస్ట్ ఎసెట్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ వుంది! అంతా బాగానే వుంది.... అయితే, వరుసగా అనామిక గురించి బయటకొస్తోన్న వార్తలు మాత్రం అస్సలు పాజిటివ్ గా లేవు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. హిందీ కహానీలో విద్యా బాలనేదే మెయిన్ రోల్! అంటే తెలుగు అనామికలో నయనదే ప్రధాన పాత్ర అని కదా అర్థం! బట్... సమ్ హవ్... నయన మేడమ్ ఆడియోకి మిస్ కొట్టారు. ఎందుకూ అంటే శేఖర్ కమ్ములకి లాస్ట్ మినిట్ దాకా వస్తానని చెప్పి కూడా హ్యాండిచ్చిందని కొందరి టాక్! నిజంగా అంత అన్ ప్రఫెషనల్ గా నయన్ బిహేవ్ చేసిందో లేదో మనకు తెలియదుగాని... ఆమె చుట్టూనే తిరిగే స్టోరితో రెడీ అయిన అనామిక ఆడియో రిలీజ్ కి తను లేకపోవటం పెద్ద లోటే! నయనతార సినిమా ప్రమోషన్ కి సహకరించటం మాట అలా వుంచితే... సినిమాలో ఆమె క్యారెక్టర్ విషయంలో శేఖర్ కమ్ముల పెద్ద మిస్టేక్ చేశాడేమో అంటున్నారు కొందరు అబ్జర్వర్స్! ఏంటి అంటారా? హిందీ వెర్షన్ లో విద్యా బాలన్ సినిమా పొడవునా ప్రెగ్నెంట్ గా కనిపిస్తుంది. చివర్లో ఆ గర్భం డమ్మీ అని తెలిసిపోతుంది. ఇది స్టోరికి పెద్ద ట్విస్ట్! కాని, శేఖర్ ఏం ఆలోచించాడో ఏమోగాని నయనతారని ఫ్లాట్ టమ్మీతోనే చూపించాడు! మమ్మీ అవ్వబోయే లేడీగా చూపిస్తే ఆమెపైన ప్రేక్షకులకి సానుభుతి కలుగుతుందని, అది వద్దనుకున్నానని వివరణ కూడా ఇచ్చాడు. తొలి సారి రీమేక్ సినిమా చేస్తోన్న శేఖర్ కమ్ముల హిందీ కహానీ సినిమా కహానికి... తనకు తోచిన ఆల్ట్రేషన్స్ చేశాడు. కాకపోతే, ఇవి ఎంత వరకూ బాక్సాఫీస్ హర్డిల్స్ ని దాటుతాయి? తెలియాలంటే... వి హ్యావ్ టూ వెయిట్ ఫర్ ది రిలీజ్!

మరింత సమాచారం తెలుసుకోండి: