పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సారి ప్రత్యక్షంగానే కామెంట్స్ చేశాడు. ఇంతకాలం వీరిద్దరూ ఒకరికొరూ కామెంట్ చేసుకోకుండా సర్థిచెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎంత కాలం ఇలా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరూ కవర్ చేసుకుంటూ వస్తారు. ఏదో ఒక రోజు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం జరగాలి. అందుకే మొదటగా అన్న చిరంజీవే, పవన్ పార్టీపై ఎదురుదాడికి దిగాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. "పవన్ పార్టీపై జనాభిప్రాయం ఈ విధంగా ఉందంటూ చిరంజీవి చెప్పదలుకున్నదంతా అందరి ముందు చెప్పాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీను పెడతాడు అని ఏనాడు నేను అనుకోలేదు. కాని పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ, అలాగే తన పార్టీ ముందు ఉన్న ఎజెండాలు అన్నీ ఆచరణ సాధ్యం కానివిగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఎలా ఉండాలో తెలియదు. అలాగే ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో కూడ తెలియదు. తను తన పార్టీను ముందుకు నడిపించటం అనేది పెద్ద సవాలే అని కామెంట్ చేశాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్, కాంగ్రేస్ ను తిట్టడం అనేది ఓ స్టైల్ అని అనుకుంటున్నాడు. ఎందరో మంది తిట్టారు. తిట్టిన వాళ్ళే వచ్చి కాంగ్రేస్ లో కలిసారు. జనసేన పార్టీకూడ అంతే.” అంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ పై చిరంజీవి నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: