ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల టైటిల్ కార్డుల నుంచి ఆడియో వేడుకల వరకు తన సినిమాలలో ఉపయోగించిన మెగా పవర్ స్టార్ పదాన్ని రామ్ చరణ్ వదులు కోవడానికి నిశ్చయించు కున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ లను అభిమానులు ప్రేమగ పిలుచుకునే మెగాస్టార్ – పవర్ స్టార్ టైటిల్స్ లోని మెగాపవర్ ను కలుపుకుని మెగాపవర్ స్టార్ గా తన అభిమానులచేత పిలిపించుకుని మురిసిపోయేవాడు చరణ్. కానీ పవన్ రాజకీయ ప్రవేశం చేసిన నేపధ్యంలో మారిన పరిస్థితులలో ఇక తన సినిమాలలో ఈ పదం వాడకం వల్ల పరోక్షంగా మళ్ళీ పవన్ ను తనకు తాను గుర్తు చేసే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మెగా పవర్ స్టార్ పదాన్ని తన కొత్త సినిమా ‘ గోవిందుడు అందరివాడే’ సినిమాలో ఉపయోగించ కూడదని చెర్రీ నిర్ణయించు కున్నాడట.  అదే విధంగా తను నటించే కొత్త సినిమాలలోని ఎటువంటి సన్నివేశాలలోను బ్యాక్ డ్రాప్ గా పవన్ సినిమాల పోస్టర్స్ గాని స్టిల్స్ గాని ఉపయోగించ వద్దని తన దర్శక నిర్మాతలకు చరణ్ చరణ్ సూచనలు చేస్తున్నట్లు టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటె భవిష్యత్ లో చిరంజీవి పవన్ తో కలిసి పోయినా చరణ్ మాత్రo తన బాబాయిపై కోపం తగ్గించు కునేలా లేడు అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: