ఇండియన్స్ కి మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలా? దే క్రేవ్ ఫర్ ఇట్! అయితే, వెస్టన్ మ్యూజిక్ మనకు ఇప్పటికీ పెద్దగా పట్టదనే చెప్పాలి. హిందీ, తెలుగు, తమిళ్... ఇలా బోలెడంత సంగీతం వుంది మనకు. అదేనండీ... మనకు ఎన్ని లాంగ్వేజెస్ వున్నాయో అన్ని పాటలూ వున్నాయి! మరి ఇంక ఇంగ్లీష్ ఎందుకు చెప్పండి? ఒకవేళ మీరు ఇలా ఫీలైతే మాత్రం మీ ఓపినీయన్ ఛేంజ్ చేసుకోండి! మన సింగర్ ఒకరు ఇంగ్లీష్ పాటలతో అదరగొట్టేస్తున్నారు. ఎవరో తెలుసా? తనే ప్రియాంక చోప్రా. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తంది. బాలీవుడ్ ఆన్ స్క్రీన్ బ్యూటీ పిగ్గీ చాప్స్.... చాలా రోజుల కిందటే పాప్ మ్యూజిక్ లో అడుగుపెట్టింది మిగతా బి-టౌన్ బేబ్స్ కి భిన్నంగా ఈమె ఆడటమే కాకుండా పాడటమూ ప్రొఫెషనల్ గా ప్రాక్టీస్ చేసి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తోంది. ఐ కాంట్ మేక్ యూ లవ్ మీ.... అనేది ప్రియాంక తాజాగా రిలీజ్ చేసిన జింగిల్. అయితే, ఇంకా వీడియో రిలీజ్ కాని ఈ సాంగ్ అమెరికన్ అండ్ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్స్ లో సంచలనం సృష్టిస్తోంది. అయితే చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ ఇంగ్లీష్ సాంగ్ కంటే ముందు కూడా పీసి మరో రెండు పాటలు విడుదల చేసింది. అందులో ఒకటి... ప్రియాంక తన ఎక్సోటిక్ అందాల్ని ఎరోటిక్ గా ప్రదర్శించిన ఎక్సోటిక్ సాంగ్.... ఇందులో ఆమెతో పాటూ ఫేమస్ సింగర్ పిట్ బుల్ కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: