ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల పుణ్యమాని... మన సినిమా సెలబ్స్ చాలా మంది హ్యాకర్ల ఎరకి చిక్కుతున్నారు. టాప్ సెలబ్రిటిల సోషియల్ అకౌంట్స్ ఏ విధంగా హ్యాక్ చేయబడ్డాయో ఇప్పుడు చూసేద్దాం. ఫేస్ బుక్ అండ్ ట్విట్టర్ మనకే కాదు సెలబ్రిటీలకూ పెద్ద ఎడిక్షన్ గా తయారయ్యాయి. వాట్ని పెద్ద పెద్ద సినిమా తారలు, దర్శకులు, ఇతర టెక్నీషయన్స్ అండ్ యాక్టర్స్ తెగ వాడేస్తున్నారు. తమ ఫ్యాన్స్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోటానికి వాళ్లకి ఈ సోషల్ నెట్ వర్కింగ్ బాగా ఉపయోగపడుతోంది. అయితే, సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ అంశం జనానికి క్రేజీగా కనిపిస్తుంది. అందుకు, ఈ అకౌంట్స్ కూడా మినహాయింపు కాదు. నెట్ వర్కింగ్ సైట్స్ లో సెలబ్స్ అకౌంట్లని హ్యక్ చేసి తమకు తోచినట్టు కామెంట్స్ చేయటం, ప్రైవేట్ మెసేజ్ లు పెట్టడం ఈ మధ్య ఎక్కువైపోయింది. దీని వల్ల ఎవరి అకౌంట్ అయితే హ్యాక్ అవుతుందో... ఆ సెలబ్రిటీ పరువు మంటగలుస్తుంది! హ్యాకర్స్ ఇతర సినిమా సెలబ్రిటీలు, పెద్దలపై ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయటం, ఫ్యాన్స్ తో బూతు కామెంట్లు షేర్ చేయటం... ఇలా వెధవ పనులు చేస్తుంటారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే... జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సైబర్ పోలీసులకి మన సినిమా ప్రముఖులు కంప్లైంట్ ఇవ్వటం అనే ఫార్మాలిటి మాత్రం మిగిలిపోతుంది.హీరో, హీరోయిన్సే కాదు ఒక్కోసారి హ్యాకర్స్ చేతికి కరణ్ జోహర్ లాంటి డైరెక్టర్స్ కూడా చిక్కుతుంటారు. ఆ మధ్య ఆయన అకౌంట్ అలానే హ్యాకైపోయింది. సదరు సైబర్ కిలాడీ... ఆయన నెట్ వర్కింగ్ అకౌంట్ నుంచి అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ మెసేజ్ లు పంపేశాడు.... ఇక గార్జియస్ గబ్బర్ సింగ్ గాళ్... శృతీ అకౌంట్స్ అయితే రెండు సార్లు హ్యాకైపోయాయి! వెంటనే హాట్ హసన్ బేబీ ``నా అకౌంట్ ఎవరో ట్రాప్ చేశారు`` అని నెత్తి నోరూ కొట్టుకుని చెప్పాల్సి వచ్చింది. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారానే జనానికి బాగా పరిచయమైన న్యూడ్ అండ్ నాటీ గాళ్ పూనమ్ కూడా హ్యాకర్ల షాకేంటో రుచి చూడాల్సి వచ్చింది! ఈమెదైతే ఏకంగా అఫీషియల్ వెబ్ సైటే పాకిస్థాన్ నుంచి హ్యాకైపోయింది. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదంటూ హ్యాకర్ మ్యాటర్ పెట్టేశాడు వెబ్ పేజ్ లో! అంతే కాదు...పూనమ్ సౌత్ బ్యూటీస్ త్రిషా అండ్ హన్సిక కూడా హ్యకై... షాకైన వాళ్లే! బాలీవుడ్లోని మరికొందరు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు సన్నీ లియోన్, పూనమ్ పాండే లాంటి ఫీమేల్ యాక్టర్స్ కి బూతు మెసేజ్ లు పంపారు. మహేష్ భట్ ఆ మెసేజ్ లతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే సయాలీ భగత్ ఆ మధ్య సయాలీ భగత్ అమితాబ్ లాంటి లెజెండ్ తనతో లైంగికంగా మిస్ బిహేవ్ చేశాడని మెయిల్ పంపింది తన పీఆర్ చూసే కంపెనీకి. తీరా చూస్తే అది ఆమె పంపిన ఈ మెయిల్ కాదట. అప్పటికే ఆమె మెయిల్ అకౌంట్ హ్యాకైపోయి ఆ దారుణం జరిగిపోయిందట! ఇక వివాదాల కేరాఫ్ లాంటి పాకిస్థాన్ హాట్ ఐటెం గాళ్ వీణ మలిక్... తన అకౌంట్ కూడా హ్యాక్ చేశారని ఆ మధ్య వాపోయింది! ఆమె టైమ్ లైన్ పైన ఇండియా గురించి పిచ్చి పిచ్చి రాతలు ప్రత్యక్షమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: