టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ ఏంటంటే ప్రకాష్ రాజ్ టాపిక్. ప్రకాష్ రాజ్ ప్రవర్తన అనేది డైరెక్టర్స్ ను లెక్క చేయని తనంగా ఉందని, అలాగే టెక్నిషియన్స్ ను గౌరవించటం ప్రకాష్ రాజ్ కు తెలియదని టాలీవుడ్ ఆవేధన. ఒక మూవీకు ప్రకాష్ రాజ్ కాల్షీట్స్ ఇస్తే, ఇచ్చిన టైం కు రావటం అనేది ప్రకాష్ రాజ్ డిక్షనరీలోనే లేదని టాలీవుడ్ అంటుంది. అలాగే ప్రకాష్ రాజ్ తీరా మూవీలో నటించిన తరువాత, తనచేత డబ్బింగ్ చేప్పించుకోవటం అంటే దాదాను నిర్మాతకు తలబొప్పి కట్టినంత పని అవుతుందని చాలా మంది అంటుంటారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పై ఏదో ఒక రోజు టాలీవుడ్ బ్యాన్డ్ విధించడం ఖాయం. అలా కాకపోయినా ప్రకాష్ రాజ్ ను భరించటం అనేది కూడ టాలీవుడ్ కి వల్లకాని పని. అందుకే చిన్నగానూ, శాశ్వతంగానూ ప్రకాష్ రాజ్ కు అవకాశాలను తప్పించి, అటువంటి విలన్ పాత్రలకు, తండ్రి పాత్రలకు జగపతి బాబును తీసుకోవాలని టాలీవుడ్ అంటుంది. ఈ న్యూస్ ను ఒకురు, జగపతి బాబుకు చెప్పగా ఒక విధమైన సంతోషాన్ని వ్యక్తపరిచాడంట. జగపతి బాబు ఇప్పటికే పలు మూవీల్లో కీలక పాత్రలను చేస్తున్నాడు. మహేష్ బాబు,కొరటాల శివ మూవీలో జగపతి బాబు నటిస్తున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ మూవీలోనూ, సందీప్ క్రిష్ణ మూవీలో జగపతి బాబు నటిస్తున్నాడు. మొత్తానికి ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ మర్చిపోతే, ఇప్పుడు ఫాంలో ఉన్న జగపతి బాబు టాలీవుడ్ కు కీ విలన్ గా మారాతాడని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: