పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు రివేంజ్ తీర్చుకున్నాడంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఒకపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దిల్ రాజు కి మధ్య పెద్ద వార్ నడించిందని ఇండస్ట్రీలో వినిపించిన టాక్. అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీలు కూడ ఈ న్యూస్ ను ఔననే అంగీకరించాయి. ఇదంతా అత్తారింటికిదారేది మూవీ ప్రి రిలీజ్డ్ పైరసీ కారణంతో వచ్చిన గొడవలు అని తెలిసిందే. అప్పటి నుండి పవన్ అభిమానులతో పాటు, ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ వర్గం సైతం దిల్ రాజు కి వ్యతిరేకంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తన భావాలను, ఆచరణ విధానాలను, ఓ పుస్తకం రూపంలో ఇజం పేరుతో రిలీజ్ చేశాడు. ఈ పుస్తకంపై పలువురు వ్యక్తుల నుండి అయిష్టత ఏర్పడినప్పటికీ, ఇజం బుక్ మాత్రం తెగ ఫేమస్ అయింది. ఈ బుక్ పై దిల్ రాజు రీసెంట్ గా కొందరి వ్యక్తుల మధ్య, అలాగే ఆడియో ఫంక్షన్స్ లోనూ బహిరంగంగా తన ఒపీనియన్ చెప్పాడు. పవన్ రిలీజ్ ఇజం బుక్ లోని విధానాలు, ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయంటూకామెంట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ అంటే దిల్ రాజుకి ఎంత కోపం ఉందో తెలుస్తుందని కొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ఈ విధమైన టాక్స్ చేయటం టాలీవుడ్ లో సన్షేషన్ క్రియేట్ చేస్తుంది. బహుశ పవన్ కళ్యాణ్, దిల్ రాజు మధ్య నిజమైన వార్ నడుస్తుందా? అనే ఆలోచనలను కలుగజేస్తుంది వీరిద్దరి స్టైల్ ను చూస్తుంటే. దిల్ రాజుకు పవర్ స్టార్ త్వరలోనే కౌంటర్ ఇస్తాడని ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: