బాలీవుడ్ మూవీకు సమంత ఓకె చెప్పేసిందనే వార్తలు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంలో సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తే కాదనుకొంది. అయితే ప్రస్తుతం మాత్రం సమంత ఓ బాలీవుడ్ మూవీకు సంబంధించిన తెలుగు రిమేక్ లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ కర్లింగ్ బ్యూటి కంగనారనౌట్ నటించిన క్వీన్ మూవీ సన్షేనల్ సక్సెస్ ను సాధించింది. ఈ మూవీనే తెలుగులో రిమేక్ చేయటానికి సన్నాహాలు చేశారు. అయితే కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా, ఒకేసారి కోలీవుడ్ లోనూ ఈ మూవీను రిమేక్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అందుకే రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ చెందిన హీరోయిన్ ను ఇందుకు ఎంచుకున్నారు. ప్రస్తుతం సమంత లీడింగ్ లో ఉంది కాబట్టి, క్వీన్ మూవీను తను సెట్ అవుతారని ఫిల్మ్ మేకర్స్ అనుకున్నారు. అందుకు సమంత కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిటైల్స్ బయటకు తెలియజేస్తారని కోలీవుడ్ టాక్. నిజానికి సమంతకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చినప్పటికీ, తను మాత్రం బాలీవుడ్ కు వెళ్ళటంలేదు. ఎందుకంటే సమంత ఫిగర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెట్ కాదనేది తన భావనగా, సమంత సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అందుకే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీను ఓ ఊపు ఊపేయటానికి సమంత సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: