పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నైజాం ఏరియాకు కలక్షన్స్ చక్రవర్తిగా బయ్యర్లు అభివర్ణిస్తూ ఉంటారు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న అప్పటి పరిస్థుతులలో పవన్ నటించిన ‘కొమరం పులి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలకు అప్పటి తెలంగాణ ఉద్యమ వేడి తాకింది. అయినా అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ కలక్షన్స్ బాదుషా గా పవన్ ను అభివర్ణిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన పవన్ ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు కేవలం నైజాం ఏరియాలోని 20, 25 కోట్లు వసూలు  చేసి ఏ టాప్ హీరో అందుకోలేని రికార్డుల సింహాసనం పై పవన్ ను కూర్చో పెట్టాయి. ఈ పరిస్థుతులలో జనసేన పెట్టిన పవన్ మోడీ చంద్రబాబులతో జత కట్టి తన కెరియర్ కు సంబంధించి పెద్ద సాహసమే చేస్తున్నాడు అంటూ మాటలు వినిపిస్తునాయి.  దీనికి కారణం తెలంగాణ రాష్ట్రంలో మోడీ చంద్రబాబులు కలిసి పోటీ చేస్తున్నా వారి వ్యక్తిగత టార్గెట్లు మాత్రం వేరు. ఎన్నికల తరువాత తన ప్రధానమంత్రి పదవి కోసం ఎవరితోనైనా జత కట్టే స్థితిలో మోడీ ఉన్నారు. చంద్రబాబుకు అయితే సీమంధ్ర ప్రాంతానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం టార్గెట్. ఈ పరిస్థుతులలో పవన్ ఈరోజు నుండి తెలంగాణ ప్రాంతలో దాదాపు 45 అసెంబ్లీ నియోజక వర్గాలలో కెసిఆర్ మరియు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ చేపట్టబోతున్న సుడిగాలి ప్రచారం అనుకున్న ఫలితాలు ఇవ్వకుండా సర్వేలు ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో క్రియాత్మక శక్తిగా కెసిఆర్ రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో ఒక ప్రముఖ శక్తిగా మారితే మాత్రం ఎన్నికల తరువాత విడుదల అయ్యే పవన్ సినిమాల విషయంలో అభిమానులలో ఎటువంటి తేడా లేకున్నా మారబోతున్న  పరిస్థుతుల పరిస్థుతుల నేపధ్యంలో పవన్ తన నైజాం బాదుషా పదవిని కోల్పోవలసి వస్తుందేమోననే విశ్లేషణలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: