మోహన్ బాబు కుమార్తె లక్ష్మి మంచు చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు తెలియ చేసింది. తాను ఇప్పటి వరకు సినిమాల ద్వారా సంపాదించింది ఏమి లేదని అంటూ ఎంతకాలం తనతండ్రి సంపాదన పై ఆధారపడి ఉండాలో అర్ధంకాక కొన్ని డేరింగ్ పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నా తన తండ్రి ఒప్పుకోవడంలేదని అంటోంది. ఈమధ్య అనేకమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే క్యారెక్టర్ తో ఒక సినిమా చేద్దాము అని అనుకుంటే తన తండ్రి ఒప్పుకోలేదని చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆమెకి హాలీవుడ్ చిత్రం 'ప్లేయింగ్‌ బై హార్ట్‌' అంటే చాలా ఇష్టం అట. ఆ సినిమాని ఎలాగైనా టాలీవుడ్‌లో రీమేక్ చేయాలని అనుకునేదట. కానీ అందుకు ఆమె తండ్రి, మోహన్ బాబు ససేమిరా వద్దు అనడంతో వెనకడుగు వేయక తప్పలేదట.  ఎందుకంటే ఆ సినిమాలో పాత్రలు మన సంస్కృతికి భిన్నంగా ఉండటం వలన ఆ సినిమా రీమేక్ చేయడానికి తన తండ్రి మోహన్ బాబు వద్దన్నారు అంటూ వివరించింది మంచువారి అమ్మాయి. ఆ సినిమాలో ఏంజెలీనా జోలిలాంటి పాత్ర గురించి తాను తరచుగా కలలకంటూ ఉండేదాన్ని అని అంటూ, ఓ ఇండిపెండెంట్ అమ్మాయి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉండటం అనేది ఇక్కడ ఒప్పుకోరని అందువల్ల ఆ పాత్ర చేయలేక పోయానని చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న.  రేపు విడుదల కాబోతున్న 'చందమామ కథలు' సినిమాలో తాను సిగరెట్టూ మరియు మందు తాగిన పాత్రలో నటించానన్న విషయం మాత్రమే తన తండ్రికి తెలుసనీ అయితే ఆ సినిమాలో తాను కొన్ని బూతు డైలాగ్స్ కూడా చెప్పాననీ ఈ విషయం తెలిస్తే తన తండ్రి మోహన్ బాబు ఏమంటాడో అన్న భయం తనలో ఉంది అని అంటోంది మన మంచు వారి అమ్మాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: