బుడ్డోడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సంభందించిన వివరాలను తెలియచేయడానికి నిన్న గురువారం ప్రెస్ మీట్ పెట్టి చెబుతాడని వార్తలు రావడంతో జూనియర్ ప్రెస్ మీట్ గురించి అటు మీడియా ఇటు జూనియర్ అభిమానులు చాల ఆసక్తి గా ఎదురు చూసారు. అయితే ఎపిహెరాల్డ్ కు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జూనియర్ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయక పోవడానికి గల కారణం జూనియర్ తండ్రి హరి కృష్ణ అని తెలుస్తోంది. తనకు ఎన్నికలలో టికెట్ ఇవ్వడానికి విలువ ఇవ్వని చంద్రబాబు ఆధిపత్యం పై రగిలిపోతున్న హరికృష్ణ కేవలం ప్రచారానికి కూరలో కరివేపాకులా జూనియర్ ను ఉపయోగించుకుని వదిలేద్దామని అనుకుంటున్న నారా వారి కుటుంబ ఆలోచనకు చెక్ పెట్టె ఉద్దేశ్యంతోనే తన కుమారుడు ఎన్టీఆర్ మీడియా సమావేశాన్ని ఆఖరి నిముషంలో రద్దు చేయించినట్లు తెలుస్తోంది.  జూనియర్ మామగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నార్నె శ్రీనివాస రావు కూడా టీడీపి తరపున ప్రచారం చేయమని తన అల్లుడు జూనియర్ కి చెప్పినప్పటికీ, తండ్రి హరిక్రిష్ణ ఆదేశాల మేరకే జూనియర్ వెనక్కి తగ్గినట్లు ఫిలింనగర్ టాక్. దీనితో ఎన్నికల ప్రచారంలో యంగ్ టైగర్ ప్రచారం ఉంటుంది అని అనుకున్న తెలుగుదేశ వర్గాలకు ఊహించని వార్తగా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: