ప్రతీ మనిషిలోనూ ఓ టాలెంట్ వుంటుంది. కాని, కొందరిలో ఒకటి కంటే ఎక్కువ టాలెంట్స్ వుంటాయి! ఇప్పుడు డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా విషయంలో అదే ఋజువవుతోంది! అసలు ఆయనలా మరెవరూ డ్యాన్స్ చేయలేరని మనకు తెలుసు! కాని, ఆయన తాజాగా ఓ రికార్డ్ సృష్టించాడు. దానికి సంబంధించిన న్యూస్ ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తండ్రి సుందరమ్ మాస్టార్.... సోదరుడు రాజు సుందరం... వీళ్లలానే డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రభుదేవా. కాని, డైరెక్టర్ శంకర్ ప్రేమికుడు సినిమాతో కలకలం రేపాడు! ఎముకలా..... అవేలా వుంటాయ్? అని ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో ప్రభుదేవా డ్యాన్స్ చూస్తే! కేవలం ఒకే ఒక్క సినిమాతో హీరోగానూ సత్తా చాటేశాడు! ప్రేమికుడు తరువాత కొరియోగ్రాఫర్ గానూ , హీరోగానూ రెండూ పాత్రల్లోకనిపించాడు ప్రభుదేవా! అది చాలదన్నట్టు ఆ మధ్య దర్శకుడయ్యాడు. తమిళంతో పాటూ తెలుగులో కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఎమ్మెస్ రాజు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ కి ప్రభూనే డైరెక్టర్. సౌత్ లో డైరెక్షన్ పై పట్టు సాధించిన ఈ ఇండియన్ మైకెల్ జాక్సన్ నార్త్ కి వెళ్లాడు. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఇచ్చాడు. అంత వరకూ తనను మంచి డ్యాన్సర్ గా గుర్తించిన బి-టౌన్ కి వాంటెడ్ సినిమా రూపంలో బంపర్ హిట్ ఇచ్చాడు. ప్రభూలో వున్న డైర్టెకర్ ని ముంబై సినిమా ప్రపంచం అమాంతం గుర్తించింది. వరుసగా ఆపర్లు గుమ్మరించింది. అక్షయ్ కుమార్ రౌడీ రాథోర్, షాహిద్ కపూర్ ఆర్ రాజ్ కుమార్... ఇలా కంటిన్యూయస్ హిట్స్ కొట్టాడు! గొప్ప గొప్ప కళాఖండాలు అని చెప్పుకునే సినిమాలు కాకపోయినా... బాక్సాఫీస్ వద్ద నిర్మాతకి కాసుల సునామీ సృష్టించే సినిమాలు తీయటం ప్రభూ స్పెషాలిటీ. అందుకే, మొత్తం దేశంలోనే ఆయన అత్యంత ఖరీదైన దర్శకుడిగా మారిపోయాడు. ఆయన ప్రస్తుత రెమ్యూనరేషన్ అక్షరాల ముప్పై కోట్లట! అయినా... డ్యాన్సింగ్, దాన్ని మించి హీరోగా అనుభవం, అంతకన్నా నిఖార్సైన కమర్షియల్ సెన్స్. ఇన్ని టాలెంట్స్ వున్న షో మ్యాన్ కి అ మాత్రం ముట్టజెప్పటం పెద్ద విశేషం ఏం కాదు! అంతేగా?

మరింత సమాచారం తెలుసుకోండి: