అక్కినేని కుటుంబానికి ఆవకాయకు ఉన్న సాన్నిహిత్యం చాల కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా పెట్టిన ఆవకాయను వారి సన్నిహితులందరికి పంపుతూ ఉంటారు. చివరకు విదేశాలలో ఉన్న వారి చుట్టాలకు మరియు సన్నిహితులకు ఈ కొత్త ఆవకాయ వెళుతూ ఉంటుంది. ఈ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు ఆయన భార్య అక్కినేని అన్నపూర్ణ జీవించి ఉన్నప్పుడు శ్రద్ద తీసుకుని,ఆవకాయ పెట్టించి అందరికీ పంపుతూండేవారు. ఇప్పుడీ సంప్రదాయాన్ని వారి మనవడు సుమంత్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సంవత్సరం తాను ఆవకాయ కలుపుతున్నట్లు, ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నట్లు చెప్తూ సుమంత్ ట్విట్టర్ లో ఈ ఫోటో పెట్టి సంచలనం చేసాడు.. అంటే ఇప్పుడు సుమంత్ తన చేతులతో స్వయంగా కలిపిన ఆవకాయను వారి శ్రేయాభిలాషులు,కుటుంబ సభ్యులు తినబోతున్నారన్నమాట. ఈ విధంగా అక్కినేని మనవడుగా ఆ కుటుంబ వారసత్వం నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు సుమంత్. ఇది ఇలా ఉండగా త్వరలో నిర్మాతగా కూడ మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న సుమంత్ ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో చూడాలి. సుమంత్ హీరోగా వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు' సినిమా పరాజయం చెందినా ఈ ఆవకాయల విషయంలో సుమంత్ ఎంతవరకు సక్సస్ అయ్యాడో నాగార్జున చెపితే కాని తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: