ఎంత గ్లామరస్ హీరయిన్ అయినా.... ఎంతగా స్కిన్ షో చేసినా... మనసులో ఏ మూలో మంచి స్టఫ్ వున్న క్యారెక్టర్ చేయాలని ఎవరికుండదు చెప్పండి? బబ్లీ బేబీ హన్సిక పరిస్థితి కూడా అలాగే తయారైంది. కెరీర్ మొదట్నుంచీ కెవ్వుమనిపించే గ్లామరస్ పాత్రలే చేసింది తను. అయితే, ఇప్పుడు ఆమె మనసుకి నచ్చిన క్యారెక్టర్ దొరికిందట! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. వరుసగా లవ్ స్టోరీలు చేస్తూ.. గ్లామర్ డాల్ పాత్రలకే పరిమితమైన హన్సిక.... తనని అభిమానులు ఇలానే చూడడానికి ఇష్టపడుతున్నారు అని కూడా చెప్పుకొచ్చింది. ఈమె నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా టాలీవుడ్ లో రీసెంట్ గా మంచి రెస్పాన్సే సంపాదించింది! ప్రస్తుతం హనీ చేతినిండా తమిళ సినిమాలు వున్నాయి. గ్లామర్ రోల్స్ చేస్తూ పైకి ఎన్ని డాంభికపు మాటలు మాట్లాడినా.... లోలోన మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కోసం బాగానే తపించింది హన్సిక! ఆ విషయం ఒక ఇంటర్వ్యూలో బయటపడిపోయింది! మీ మనసుకు నచ్చిన పాత్ర ఏమిటి అంటే సుందర్ సి తెరకెక్కిస్తున్న సినిమాలో అతీతశక్తులున్న తమిళ పల్లెటూరి యువతి పాత్ర వేశానని... ఆ పాత్ర చాలా కష్టమైనప్పటికి తనకు చాలా నచ్చిందని వివరించింది. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంతానం తదితరులు నటిస్తున్నారు. హర్రర్ కామెడి రూపంలో సాగే హన్సిక అతీత శక్తుల సినిమా తమిళంలో తెరకెక్కుతోంది.... ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ తో పండగ చేస్కో, రవితేజ తో పవర్ సినిమాలలో నటిస్తుంది. 2014 తనకు చాలా విధాలుగా మంచి ఏడాది అని ఈ భామ ఇప్పటికే సంబరపడిపోతోంది. చూడాలి మరి... హన్సిక కమర్షియల్ సినిమాల్ని బాగానే ఎంజాయ్ చేసిన ఆడియన్స్... ఆమె చేసిన డిఫరెంట్ మూవీని ఎలా ఆదరిస్తారో? డబ్బింగ్ అయి మన వద్దకూ వస్తుంది కాబట్టి మనమూ ఓ లుక్ వేయోచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: