దగ్గుబాటి రానా ప్రస్తుతం కృష్ణం వందే జగద్గురం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురం సినిమాలో రానా సురభి కళాకారుడిగా నటిస్తున్నాడు.  కాగా, ఈ సినిమాలో రానా బాబాయ్, ప్రముఖ నటుడు వెంకటేష్ కూడా ఒక చిన్న పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో సమీరారెడ్డితో ఒక ఐటెం సాంగ్ తీయడానికి దర్శకుడు క్రిష్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సాంగ్ లో రానాతో పాటు, వెంకటేష్ కూడా కనిపిస్తాడట. అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలోనూ అబ్బాయ్ తో బాబాయ్ నటిస్తాడు. కాగా, ఈ కృష్ణం వందే జగద్గురం సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.     

మరింత సమాచారం తెలుసుకోండి: