గుండమ్మకథ మరలా తీయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ ఎప్పుడో పచ్చజండా ఊపేశారు. ఇటు నాగచైతన్య కూడా సరేనన్నాడు. సమంత, అంజలి లాంటి నాయికలు ఇన్ స్టెంట్ గా దొరుకుతారన్న నమ్మకం ఎటూ ఉంది. ఎటొచ్చీ అందరి డిష్కషన్ గుండమ్మ పాత్రధారి గురించే.  ఎన్ని సార్లు ఆలోచించిన ఆ పాత్రకు సీనియర్ నటి గీతాంజలి అయితే చక్కగా సరిపోతుందని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. సూర్యకాంతాన్ని తలపించే ఆకారంగానీ, మాటతీరుగానీ గీతాంజలిని తప్పిస్తే మరొకరికి లేవన్నది ఫిల్మ్నగర్ చెప్తున్న మాట.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తే బావుంటుందని పలువురు భావిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాను ఎఎంఆర్ సంస్థ నిర్మిస్తుందని వినికిడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: