అందానికి నిలువెత్తు నిర్వచనంలా వుంటుంది శ్రియ. అందుకే, ఆమె ఎంట్రీ ఇచ్చి పదేళ్లు గడిచిపోతున్నా ప్రేక్షకుల మోజు తగ్గటం లేదు. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీస్ లో ఆమె ఇప్పటికీ ఒకటి అరా సినిమాలతో నెట్టుకొస్తోంది! అయితే, కన్నడలో కూడా శ్రియ కోసం ఆడియన్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బట్... ఎందుకోగాని శ్రియ కన్నడ ఆఫర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. శ్రియ పరిస్థితి ఇప్పుడు డెడ్ ఎండ్ కి వచ్చేసింది. మరీ ఆఫర్స్ లేవని కాదుగాని ఒకప్పటి జోష్ ఇప్పుడు లేదు. తెలుగులో, హిందీలో, తమిళంలో ఎక్కడ చూసిన నిరాశాజనకంగానే బండి నడుస్తోంది. దీనికి కారణం గ్లామరే అన్నిటి కన్నా పెద్ద రూల్ గా నడిచే సినిమా బిజినెస్ లో శ్రియకి పోటీ ఎక్కువైపోయింది. రోజుకో కొత్త అందం వచ్చే సరికి ఈ సోగసరికి పని లేకుండా పోతోంది.... తెలుగులో లాస్ట్ మూవీగా పవిత్ర అనే ఫ్లాప్ సినిమా చేసింది శ్రియ. ఇక తమిళంలో అయితే మరీ దారుణంగా వుంది పరిస్థితి. 2011 తరువాత చెన్నైలో ఈమెకి వర్కే లేదు. ప్రస్తుతం ఓ సినిమా చేతిలో వున్నప్పటికీ పెద్దగా డిమాండ్ పుట్టుకొచ్చే సీన్ అస్సలు లేదు. తెలుగు, తమిళంలో ఆఫర్స్ నిండుకుంటే... దక్షిణాది హీరోయిన్స్ వెంటనే కాన్సన్ ట్రేట్ చేసేది కన్నడ పైన. అయితే, ఎందుకోగాని శ్రియా సరన్ ఇప్పటిదాకా బెంగుళూరుపైన దృష్టి పెట్టలేదు. ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది గాని ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మాత్రం అక్కడి రసికుల్ని కరుణించలేదు. సరిగ్గా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే రవిచంద్రన్ అనే ఓ సీనియర్ కన్నడ నటుడు శ్రియని అప్రోచ్ అయ్యాడు. తన నెక్స్ ట్ మూవీ శృంగార రామాలో నటించమన్నాడు. ఏం నచ్చలేదోగాని శ్రియ ఆఫర్ రిజెక్ట్ చేసేసింది! సాండల్ వుడ్ లో ఇప్పటికిప్పుడే ముసలి హీరోలతో జోడీ కట్టేస్తే తనని యంగ్ హీరోలు పట్టించుకోరని శ్రియ భావించిందంటున్నారు క్రిటిక్స్! అదే అయితే... శ్రియ చేసిన రిస్క్ తప్పేం కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: