భారతదేశంలో లతా మంగేష్కర్ తర్వాత ఎక్కువ సినిమాలకు పాడింది పి.సుశీల. దాదాపు ఆరు దశాబ్దాలుగా గీతాలాపన చేస్తూనే ఉన్నారు. 1951లో పెండ్యాల నాగేశ్వరరావు సినిమా ‘కన్నతల్లి’తో సినిమా రంగంలో అడుగుపెట్టారు సుశీల. ఆ సినిమాను తమిళంలో ‘పెట్రతాయ్’గా విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె స్వరం విన్న ఎవిఎం చెట్టియార్ ఆమె చేత తమిళ పాటలు పాడించారు. తమ సంస్థ పర్మనెంట్ గాయనిగా కుదుర్చుకున్నారు. ఎ.వి.ఎం.లాంటి ప్రతిష్టాత్మక సంస్థ గాయనిగా గుర్తించాక మిగిలిన వారు కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ‘‘నిన్నమొన్న ఫీల్డ్ లోకి వచ్చినట్టుంది. అప్పుడే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి’’ అని అంటున్నారు సుశీల తన అదృష్టానికి మురిసిపోతూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: