హన్సికకు ఓ హాబీ ఉంది. బొమ్మలు గీయడం. తన ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తిని పెంచుకుంది. తను గీసే అందమైన పెయింటింగ్ లను తను నటిస్తున్న సినిమా ఆఖరి రోజు కో స్టార్ లకు పంచడం ఈ బొద్దుగుమ్మకి బాగా అలవాటట.  ఇటీవల ‘దేనికైనా రెడీ’ షూటింగ్ పూర్తయ్యాక విష్ణుకు కూడా అందజేసిందట. త్వరలో తను గీసిన అన్ని మోడ్రన్ పెయింటింగ్ లతో ఓ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసి వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థుల చదువులకు పంచనుందట హన్సిక. దయగల నాయిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: