ఇషాచావ్లా ఆర్.ఆర్. మూవీస్ ఆస్థాన నాయిక. ఇప్పటికి మూడు సినిమాలు చేసిందీ అదే సంస్థలోనే. ఈ భామ మూడు సినిమాలు చేసినా ఇప్పటికీ కెమెరా ముందు అంతా కొత్తగానే ఉంటుందట. ఈ విషయాన్ని ఈ సుందరి స్వయంగా చెప్పింది. ‘‘పరిశ్రమలోకి ఏమీ తెలియకుండా అడుగుపెట్టాను. ఇప్పుడిప్పుడే టెక్నికల్ విషయాలను గురించి తెలుసుకుంటున్నాను. నేను గ్లామర్ గా నటించడానికి ఒప్పుకుంటే బోలెడన్ని సినిమాలు నా ముందుంటాయి. కానీ నేను ఓ మోతాదుకు మించి గ్లామర్ గా నటించనని ముఖం మీద చెప్పేస్తున్నాను. మరీ గ్లామర్ గా నటించడం నాకు నచ్చదు. అందుకే అలా చెప్తున్నాను’’ అని చెప్పింది ఇషాచావ్లా. 

మరింత సమాచారం తెలుసుకోండి: