ఒక్కసాంగ్… ఒకే ఒక్కసాంగ్… ఐటం బాంబ్ లా పేలిపోతుంది… టాప్ హీరోయిన్ ఉన్నా సరే… ఐటంసాంగ్ హల్ చల్ చేస్తోంది… సినిమాకే అడిషనల్ అట్రాక్షన్ గా మారుతుంది… గతేడాది ఇలాంటి ఐటంబాంబ్ లు చాలానే చూశాం… ఈ ఏడాది బాలీవుడ్ లో కరీనా మరో ఐటంసాంగ్ తో కనువిందు చేయనుండగా సౌత్ లో తమన్నా ఐటం నెంబర్ గా మారింది… ఒక్క పాటతో ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న ఐటంభామలు గురించి ఎపిహెరాల్డ్. కామ్ ఎడిటోరియల్ లో చూద్దాం. సినిమా మొత్తం చేసింది ఒక ఎత్తైతే… ఒక్క ఐటం సాంగ్ చేయడం ఒక ఎత్తు… సినిమా సక్సెస్ అయినా హీరోయిన్కి పేరొస్తుందో లేదోగానీ ఐటం నంబర్ క్లిక్ అయితే మాత్రం కావల్సింత క్రేజ్ సొంతమవుతుంది… ఇప్పుడిదే ఫార్ములా అప్లై చేస్తున్నారు హీరోయిన్లు… బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా హీరోయిన్లు ఐటం భామలుగా మారుతున్నారు.  ఇప్పుడంతా ఇన్ స్టంట్ కాఫీలా మారిపోయింది… వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం… ఈ ఫార్ములాను బాగా అప్లై చేస్తున్నారు హీరోయిన్లు... హీరోయిన్ క్యారెక్టరైనా… స్పెషల్ సాంగ్ అయినా… పర్ఫామ్ చేసిందే లెక్క… రెమ్యూనరేషన్ కి రెమ్యూనరేషన్… పాట క్లిక్ అయితే కావల్సినంత క్రేజ్… టాలీవుడ్ సంగతి పక్కనబెడితే బాలీవుడ్లో ఈ ఫార్మూలాను చాలా కాలంగా అప్లై చేస్తున్నారు స్టార్ హీరోయిన్లు… నిన్నటి తరం హీరోయిన్ మాధురి దీక్షిత్ నుంచి నేటితరం బబ్లీగాళ్ ప్రియాంక వరకు ఇదే రూట్లో వెళ్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే ఐటం సాంగ్స్ తో హల్ చల్ చేస్తున్నారు. దబాంగ్-2లో ఫెవికాల్ సాంగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని మత్తెక్కించింది కరీనా కపూర్… పెళ్లయ్యాక ఐటం సాంగ్ చేసినా సిట్యువేషనల్ ఎక్స్ప్రెషన్స్, పర్ఫామెన్స్ రెండిట్లోనూ ఎక్కడా తేడా కనిపించలేదు… అందుకే సాంగ్ అంతలా పేలింది… ఇప్పుడు మరోసారి ఐటం నెంబర్ చేసింది కరీనా… దబాంగ్-2లో సల్లూభాయ్ తో ఆడిపాడిన బేబో ఇప్పుడు గబ్బర్ సినిమాలో అక్షయ్కుమార్ తో స్టెప్పులేసింది. తెలుగులో సూపర్ హిట్టయిన ఠాగూర్ రీమేక్ గా క్రిష్ డైరెక్షన్లో గబ్బర్ తెరకెక్కుతోంది. తలాష్ సినిమా తర్వాత కరీనా పెళ్లి చేసుకుంది… ఆతర్వాత నాలుగైదు సినిమాలు చేసినా ఐటం సాంగ్స్ లేదంటే స్పెషల్ అప్పీరియన్స్ కే పరిమితమైపోతోంది… దబాంగ్-2 ఫెలికాల్ సాంగ్ బాగా పేలడంతో మరో ఐటం నెంబర్ కే ప్రాధాన్యమిచ్చింది బేబో… పెళ్లయ్యాక ఎలాగో అవకాశాలు లేవు కాబట్టి వచ్చిన ఐటం సాంగ్స్ చేసుకుంటే చాలన్న ఆలోచనలో ఉంది కరీనాకపూర్. ఫెవికాల్ సే సాంగ్ కంటే ముందు… ఆతర్వాత కూడా ఐటం సాంగ్స్ బాగానే పేలాయి… రీసెంట్ గా రామ్ లీలా సినిమాలో ఐటం నెంబర్ తో మరోసారి దుమ్మురేపింది ప్రియాంక చోప్రా… ఐటంగాళ్ గా తానూ ఎవరికీ తీసిపోనని నిరూపించింది. ఓవైపు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో దూసుకెళ్తోంది ప్రియాంకచోప్రా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు… ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియాంకచోప్రా… హీరోయిన్ గా టాప్ పొజిషన్లో ఉండగానే దుమ్మురేపే ఐటంసాంగ్స్ తోనూ హల్చల్ చేస్తోంది ప్రియాంకచోప్రా… బబ్లీ బద్మాష్ హై సాంగ్ అనుకున్నంత పాపులర్ కాకపోవడం ప్రియాంకను నిరాశకు గురి చేసింది… ఆ తర్వాత చేసిన రామ్ లీలా సాంగ్ ప్రియాంక క్రేజ్ను అమాంతం పెంచేసింది.. రామ్ చాహే లీలా చాహే పాటతో మరోసారి ఫ్యాన్ ఫాలోయింగ్ ను నిలబెట్టుకుంది ప్రియాంక. ప్రియాంక స్పెషల్ కాస్ట్యూమ్స్, మాస్ స్టెప్పులు యూత్ని షేక్ చేశాయి. ప్రియాంక కంటే ముందు కత్రినా, దీపిక, ఐశ్వర్య కూడా ఐటం నెంబర్లతో ఇండస్ట్రీని, ఫ్యాన్స్ ను షేక్ చేసినవారే… బాలీవుడ్లో ఐటం సాంగ్స్ విషయంలో కత్రినా కైఫ్ రెండాకులు ఎక్కువే చదివింది….షిలాకి జవానీ, చిక్ని చమేలీ సాంగ్స్ ఒక్క బాలీవుడే కాదు సౌత్లోనూ దుమ్మురేపాయి. ధూమ్-3 సినిమాలో కత్రిన చేసిన స్పెషల్ సాంగ్ మెస్మరైజ్ చేసింది...భారీగా ఖర్చుచేసి షూట్ చేసిన ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా కావల్సినంత క్రేజ్ సంపాదించుకున్నా.. ఐటం సాంగ్స్ విషయంలో కత్రినా, కరీనా, ప్రియాంకతో పోల్చితే దీపిక పదుకొనే వెనకబడిందనే చెప్పాలి… బిల్లూ బార్బర్, దమ్ మారో దమ్ సినిమాల్లో దీపిక ఐటం సాంగ్స్ చేసినా అంతగా పేలలేదు… అందుకేనేమో ఐటం నెంబర్లు చేయాలంటూ వస్తున్న ఆఫర్లను కూడా వద్దంటుందట దిపిక. బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లంతా ఐటంసాంగ్స్తో హల్చల్ చేస్తూనే ఉన్నారు…. వాళ్లేనా మేమూ తీసిపోమంటూ నిన్నటి తరం హీరోయిన్లు హల్ చల్ చేస్తున్నారు…. ముఖ్యంగా మాధురి దీక్షిత్ రీఎంట్రీతోనే ఇండస్ట్రీని మరోసారి షేక్ చేసింది. ఐటం సాంగ్కు కారెవ్వరు అనర్హులులా ఉంది ప్రస్తుతం బాలీవుడ్లో పరిస్థితి… అందం, అభినయం, నృత్యం ఈ మూడింటి కలబోతగా బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ మాధురి దీక్షిత్… ఏక్దో తీన్ సాంగ్ నుంచి రీ ఎంట్రీతో దుమ్మురేపిన ఆజా నాచ్ లే వరకు మాధురి స్పెషాలిటీయే వేరు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లే ఐటం నెంబర్లతో అదరగొడుతున్న టైంలో యే జవానీ హై దివానీలో మాధురి చేసిన సాంగ్ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసింది… అదిరిపోయే స్టెప్పులు, అల్టిమెట్ ఎక్స్ప్రెషన్స్ తో మాధురి ఇచ్చిన పర్ఫామెన్స్ ఈ తరం హీరోయిన్లను పక్కకు నెట్టేలా చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా తన డ్యాన్సింగ్ స్టెమినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది మాధురి దీక్షిత్... అవకాశం వస్తే లీడ్ రోల్స్ లేదంటే స్పెషల్ సాంగ్స్తో కేక పుట్టిస్తోందీ అమ్మడు. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ ట్రెండ్ మారుతోందా? ఇన్నాళ్లూ అవకాశాల్లేని హీరోయిన్లకు స్పెషల్ సాంగ్స్ ఛాన్స్లొచ్చేవి… కానీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ మరో టాప్ హీరోయిన్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. అన్నీ కలిసొస్తే నాలుగు రోజులపాటు తెరపై కనిపించడం… హిట్లు తగిలితే టాప్ పొజిషన్ కి వెళ్లడం…. లేదంటే ఛాన్స్ల్లేక ఆఫర్ వస్తే చాలన్న పరిస్థితి సినీ ఇండస్ట్రీలో కామన్… హీరోయిన్ గా టాప్ హీరోలందరితో నటించినా కొంతకాలానికి ఫేడవుట్ అవడం మామూలే… కానీ ఇప్పుడు తమన్నా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో ఐటం సాంగ్ చేసింది… తమన్నా, సమంతా ఇద్దరూ టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లే… ఐతే మిల్కీవైట్ బ్యూటీ ఐటం నెంబర్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఆగడు, బాహుబలి సినిమాలు చేస్తున్న తమన్నా… ఆషికి-2 తెలుగు రీమేక్ ఆఫర్ కి నో చెప్పేసింది… బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ఆషికి-2లో ఆఫర్ నే కాదన్న తమన్నా… ఏకంగా ఓ సినిమాలో ఐటం సాంగ్ చేసింది… బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.. సమంత హీరోయిన్ గా చేయడం సినిమాకి ప్లస్ అయితే ఇప్పుడు తమన్నా ఐటం సాంగ్ మాంచి హైప్ క్రియేట్ చేసింది. హీరోయిన్ గా అవకాశాల్లేనప్పుడు టాలీవుడ్లో ఐటం సాంగ్స్ తో హల్చల్ చేస్తున్నారు…ఛార్మి నుంచి లేటెస్ట్ గా హంసా నందిని వరకు ఇదే రూట్లో వెళ్తున్నవాళ్లే… తమన్నా రూట్లో హీరోయిన్లు వెళ్తే మరి వీరి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు టాప్ పొజిషన్ కి వెళ్లిన తారలు… స్టార్ హీరోలందరితో నటించిన భామలు… ముంబై భామల తాకిడి ఎక్కువవడం… తెలుగమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువవడంతో కొందరు హీరోయిన్లకు అవకాశాల్లేకుండా పోయాయి. అందుకే వచ్చిందే అవకాశమన్నట్లు శ్రియలాంటి భామలు చిన్న హీరోలతోనూ నటించారు… లీడ్ రోల్ దొరికింది చాలంటూ చిన్న సినిమాలు కూడా చేశారు. ఛార్మి పరిస్థితి కూడా అంతే… బాలకృష్ణ నుంచి కుర్ర హీరోల వరకు అందరితో నటించింది చార్మి… పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో స్పెషల్ సాంగ్స్ తో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది… టాప్ హీరో సినిమా అయితే చాలు ఐటం సాంగ్కు రెడీ అంటూ కేక పుట్టిస్తోంది. హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చినా ఆతర్వాత ఐటం భామగానే సెటిలైపోయింది హంసా నందిని… మిర్చీ సాంగ్తో ఓ రేంజ్ కి వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా లెజెండ్ లోనూ ఐటం సాంగ్ తో దుమ్మురేపింది. హీరోయిన్ క్యారెక్టర్లకోసం చూడకుండా వచ్చిన అవకాశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది. హీరోయిన్లే ఐటం సాంగ్స్ చేయడంతో ఐటంబాంబ్ లాంటి ముమైత్ఖాన్ లాంటి తారలు ఫేడవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది… ఇండస్ట్రీలోకి చాలామంది ఐటం భామలు ఎంటరైనా… ఒక్క సినిమాకే పరిమితమవుతున్నారు… తమన్నా చూపిన బాటలో మిగతా హీరోయిన్లు నడిస్తే ఇక ఐటంగాళ్స్ కి అవకాశాలు దొరకడం కష్టమే..      

మరింత సమాచారం తెలుసుకోండి: