Shiva Thandavam Tweet Review || Shiva Thandavam Full English Review

అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విక్రమ్. విక్రమ్ హీరోగా నటించిన తాజా సినిమా శివతాండవం. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించండం ఒక విశేషమైతే, హీరో జగపతి బాబు ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించడం మరో విశేషం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ శివతాండవం సినిమా ఏలా ఉందో చూద్దాం..! 

చిత్రకథ :

  లండన్ లో బాంబు పేలుళ్ళు జరిగిన సన్నివేశాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. తరువాత నగరంలో వరస హత్యలతో జరుగుతుంటాయి. చర్చిలో సంగీతం వాయించే అంధుడైన కెన్ని (విక్రమ్) ను మిస్ ఇంగ్లాండ్ టైటిల్ కోసం పోటీ పడుతున్న సుమ వినాయకం (ఎమీ జాక్సన్) ప్రేమిస్తుంది. అయితే ఈ వరస హత్యలు చేసేది కెన్ని అని ఆమెకు తెలిసి పోలీసులకు పట్టి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. కెన్ని ఏ కారణంతో ఈ హత్యలు చేస్తుంటాడు. అసలు కెన్ని ఎవరు..? అతని గతం ఏంటి...? అనేది చిత్రకథ.    

నటీనటుల ప్రతిభ :

అంధుడు గాను, పవర్ ఫుల్ పోలీస్ అఫీసర్ గాను విక్రమ్ మంచి నటన కనబరిచాడు. ఫైట్స్ లోనూ, అనుష్క తో నడిచే ప్రేమ సన్నివేశాలలో బాగా నటించాడు. అయితే విక్రమ్ ముఖంలో వయస్సు పెరుగుతున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో విక్రమ్ జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇక, జగపతి బాబు విషయానికి వస్తే అతను ఈ సినిమాలో, ఇలాంటి పాత్ర ఎందుకు పోషించాడో అర్థం కాదు. జగపతిబాబు ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ‘నాకు డబ్బు అవసరం’ అని అంటాడు. కాబట్టి డబ్బు కోసమే ఈ సినిమాలో అతను నటించినట్లు మనం అర్థం చేసుకోవాలి. కనిపించేది కొంచెం సేపే అయినా అనుష్క అకట్టుకొంటుంది. అందంగా నటించింది. ఏమీ జాక్సన్ ఫర్వాలేదనిపించింది. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. 

సాంకేతిక వర్గం పనితీరు :

సంగీతం యావరేజ్ గా ఉంది. మాటలు ఓకే. ఫోటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను విదేశాలలో, బాగా రిచ్ గా తెరకెక్కించారు. దర్శకత్వం విషయానికి వస్తే పగ, ప్రతీకారలతో కూడిన కథనే కొత్తగా చెప్పాలని చూశాడు. దీనికి మిత్రద్రోహం కలిపి, విదేశీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. హీరోను గుడ్డివాడిని చేశాడు. ఈ సినిమాను ఇంకా ఆసక్తికరంగా తీయవచ్చు. కానీ, ఈ శివతాండవం సినిమా చాలా బోర్ గా సాగుతుంది. అలాగే హీరో ఫ్లాష్ బ్యాక్ ను ఒకేసారి చెప్పడం కాకుండా, ముక్క ముక్కలు చెప్పడం బాగోలేదు.    

హైలెట్స్ :

విక్రమ్ నటన, అనుష్క గ్లామర్, విక్రమ్-అనుష్కల మధ్య వచ్చే సన్నివేశాలు.  

డ్రాబ్యాక్స్ :

పాత కథ, బోర్ గా సాగే సన్నివేశాలు.

చివరగా :

విక్రమ్ సినిమాలలో ఒక టైం పాస్ సినిమా      More Articles on Shiva Thandvam || Shiva Thandvam Photos & Wallpapers || Shiva Thandvam Videos  
 

మరింత సమాచారం తెలుసుకోండి: