మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కడలి’. ఈ సినిమాలోని పాటల్ని తమిళ వెర్షన్ ఈ నెల 19న విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ పాటలు ఈ నెలాఖరున విడుదలవుతాయి. రాధ కుమార్తె తులసి, కార్తిక్ తనయుడు గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ప్రేమ కథా చిత్రమిది.  నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేటూరి బతికున్నంత కాలం ఆయనతోనే పాటలు రాయించుకున్న మణిరత్నం చూపు తాజాగా అనంతశ్రీరామ్ పై పడిందని వినికిడి. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త. అనంతశ్రీరామ్, చంద్రబోస్ గీత రచయితలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: