శింబు, నయనతారల మధ్య ప్రేమ వ్యవహారం తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి మధ్య గాఢ ప్రేమ నడిచింది. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుకోవాలని నిర్ణయించుకుని, పబ్‌లు, క్లబ్‌లు తిరుగుతు చేయాల్సినవి, చేసుకోవాల్సినవి అన్ని చేసుకున్నారు అని తమిళ వర్గాల టాక్‌. అయితే అనుకోకుండా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరు కూడా విడిపోయారు. చాలా ఘాటుగా జరిగిన వీరి ప్రేమ వ్యవహారం బ్రేకప్‌ కావడంతో అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. బ్రేకప్‌ అయిన తర్వాత వీరిద్దరు ఒంటరి జీవితంను గడిపారు. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా మరో లవర్‌ను చూసుకున్నారు. శింబు హీరోయిన్‌ హన్సికను తన ప్రేమలో పడేసుకుని, ఆ అమ్మడితో కూడా ప్రేమాయణం నడిపాడు. ఇక కొరియోగ్రఫర్‌, డైరెక్టర్‌ ప్రభుదేవతో నయనతార పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి కోసం క్రిస్టియన్‌ అయిన నయన్‌ హిందూ మతంను కూడా చేపట్టింది. అయితే వీరిద్దరి పెళ్లి పీఠల వరకు వెళ్లలేదు. అనుకోని కారణాల వల్ల వీరి ప్రేమ వ్యవహారం బ్రేకప్‌ అయ్యింది. మరో వైపు శింబు, హన్సికల ప్రేమ వ్యవహారం కూడా బ్రేకప్‌ అయ్యింది. ఇదే సమయంలో వీరిద్దరు కలిసి ఒకే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇద్దరు కూడా తమ లవర్స్‌తో విడిపోయిన తర్వాత కలిసి నటిస్తుండటంతో అందరి దృష్టి పడిరది. మళ్లీ వీరిద్దరు ఒక్కటి కావడం ఖాయం అని అంతా భావించారు. వీరిద్దరు ఒక్కటి కావడానికే ఈ చిత్రం అన్నట్లు తమిళ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాని ఈ విషయాన్ని నయన్‌ ఖండిరచింది. ప్రేమా గీమా ఏం లేదు. కేవలం సినిమా కోసం ఆయనతో జత కట్టాను తప్ప, ఇకపై తన మనసులో ప్రేమకు స్థానం లేదు అంటూ పలు సందర్బాల్లో చెప్పేసింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్‌ల్లో కూడా వీరు ఎడమోహం, పెడమొహం అన్నట్లు ఉంటూ వస్తున్నట్లు చిత్ర యూనిట్‌ నుండి సమాచారం అందింది. అయితే అందరి ముందు ఎడమొహం...లా ఉంటున్న వీరిద్దరు పబ్‌లు, క్లబ్‌లు అంటూ తెగ తిరిగేస్తున్నట్లు తమిళ్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వీరిద్దరు హీరోయిన్‌ త్రిష పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకల్లో వీరి మధ్య సాన్నిహిత్యంను చూసిన ఎవరైనా కూడా వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు అనుకోవాల్సిందే. ఆరోజు నుండి వీరిద్దరు మళ్లీ కలిసిపోయారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నయన్‌ స్పందిస్తూ.. తన మనసులో ప్రేమకు ఛాన్స్‌ లేదు అంటూ తాను గతంలోనే ప్రకటించాను అని, ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ మీడియా దుమ్ముదులిపేస్తుంది. ఫొటోల్లో అంత క్లోజ్‌గా కనిపిస్తుంటే ఎవరైనా వీరిద్దరి మధ్య ఏం లేదు అంటే నమ్ముతారా? పై పెచ్చు వీరిద్దరు గతంలో ప్రేమ పావురాలాయే. అందుకే అనుమానాలు వచ్చాయి. మరి ఈమేమో ఖండిస్తోంది. ఇంతకు ఏది నిజం...!!? 

మరింత సమాచారం తెలుసుకోండి: