భారతీయ తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’లో ఎల్వీప్రసాద్ ఓ పాత్ర పోషించారు. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. ఆ తర్వాత తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’లోనూ, తమిళ టాకీ ‘కాళిదాసు’లోనూ ఎల్వీ ప్రసాద్ నటించారు. అలా మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీల్లో నటించిన ఘనత ఎల్వీ ప్రసాద్ కు దక్కింది. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ సినిమాలకు పనిచేసిన ఆయన జీవితం 1945లో ఓ గొప్ప మలుపు తిరిగింది. సారథి పిక్చర్స్ నిర్మించిన గృహ ప్రవేశంతో ఆయన దర్శకత్వజీవితం మొదలైంది. ఈ సినిమాలో భానుమతి పక్కన హీరోగా నటించింది ఆయనే. ఆ తర్వాత ‘పల్నాటి యుద్ధం’, ‘ద్రోహి’ చిత్రాలకు పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడిగా అనంతర కాలంలో పేరు తెచ్చుకున్న పెండ్యాల నాగేశ్వరరావును సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత కూడా ఎల్వీ ప్రసాద్ కే చెందుతుంది. ఎన్టీఆర్ ను కూడా 1949లో మనదేశం చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత పలు కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: