పోటీ ఎప్పుడూ మంచికే అంటారు. కానీ కొందరి మధ్య పోటీ 70 ఎంఎం స్క్రీన్ మీద కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి,రాజశేఖర్, దాసరి, ఏఎన్నార్ ఆ తరహా వారే. కాకపోతే విచిత్రం ఏమిటంటే వీరిలో ఒకరు ఇంకొకర్ని ఎప్పుడూ లెక్క చేయరు. రెండో వారు మాత్రం మొదటివారి వెంట పడుతూనే ఉంటారు.  తాజాగా ఇలాంటి భావనతోనే బయటపడుతున్నారు ప్రభుదేవా, లారెన్స్. ప్రభుదేవా లారెన్స్ ను ఎప్పుడూ తనకు పోటీదారుగా అనుకోరు. తనదైన దారిలో వెళ్తుంటారు. కానీ లారెన్స్ ఏం చేసినా లెక్కల్లో ప్రభుదేవా ఉంటారు. ప్రభు డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగారన్న కసితోనే లారెన్స్ డ్యాన్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభు నటుడిగా, హీరోగా, దర్శకుడిగా అయ్యారు. లారెన్స్ కూడా ఆ మెట్లన్నీ పథకం ప్రకారం ఎక్కేశారు. ప్రభు తెలుగులో దర్శకుడిగా అవతార మెత్తారని లారెన్స్ కూడా తెలుగు సీమనే వేదికగా చేసుకున్నారు. ఇప్పుడు లారెన్స్ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉంది. ప్రభుదేవా బీ టౌన్లో సంచనాలు సృష్టిస్తున్నాడు.  అందుకే లారెన్స్ కూడా అటు కన్నేశారు. అదీ కాంచన త్రీడీతో అక్కడ అందరినీ ఆకర్షించాలని అనుకుంటున్నారు. స్పర్థయా వర్ధతే విద్య అంటే ఇదేనేమో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: